Home రాజకీయాలు పవన్ స్క్రిప్ట్ పై ఉండవల్లి క్లారిటీ!

పవన్ స్క్రిప్ట్ పై ఉండవల్లి క్లారిటీ!

SHARE

పవన్ కల్యాణ్ గుంటూరు బహిరంగ సభలో టీడీపీని ఎండగట్టిన సంగతి తెలిసిందే! ఇంతకాలం వైకాపా చేస్తున్న ఆరోపణలు, మొత్తుకుంటున్న విషయాలనే తనదైన శైలిలో పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రాన్ని అత్యంతదారుణంగా, అడ్డగోలుగా దోచుకుంటున్నారని, లోకేష్ అవినీతి మరీ బరి తెగించిపోయిందని దుయ్యబట్టారు! అయితే ఈ విషయాలపై స్పందించిన టీడీపీ నేతలు.. ఇవి బీజేపీ పలికించిన మాటలని, ఉండవల్లి రాసిన రాతలని అర్ధంలేని వాదనకు తెరతీశారు! ఈ క్రమంలో ఈ విషయాలపై తాజాగా ఉండవల్లి స్పందించారు.

పవన్ గుంటూరు సభలోని మాటలన్నీ ఉండవల్లి స్క్రిప్ట్ అని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తాజాగా అరుణ్ కుమార్ స్పందించారు. టీడీపీ మాటలు అర్ధం పర్ధం లేని విమర్శలని లైట్ తీసుకున్న ఉండవల్లి… టీడీపీకి ఎదురు ప్రశ్నలు వేశారు. చంద్రబాబు గురించి తెలుసుకోవడానికి, చంద్రబాబు గురించి విమర్శించడానికి పవన్ కు నాలుగేళ్లు పట్టిందా అని విమర్శిస్తున్న వారికి.. బీజేపీ చేస్తున్న మోసం తెలుసుకోవడానికి, బీజేపీ ఏమీ చేయదని తెలుసుకోవడానికి కూడా నాలుగేళ్లు పట్టిందా అని ప్రశ్నించారు.

ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న టీడీపీ చేయలేని పని ఒక్క ఎమ్మెల్యేగాని, ఒక్క ఎంపీగానీ అధికారికంగా ఏ అధికారం లేని పవన్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించారు. ఇదే క్రమంలో వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా టీడీపీ పై విమర్శల వర్షాలు కురిపించారు. పవన్ అత్తారిళ్ల గురించి, పవన్ సినిమా నటుడని టీడీపీ నేతలకు ఇప్పుడే తెలిసిందా.. ఇంతకాలం పవన్ వ్యక్తిగత జీవితం టీడీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీ అవసరాన్ని బట్టి కనీస నైతికత మరిచి అడ్డగోలుగా నాలుక మడతపెట్టి మాట్లాడగల నేర్పరుల పార్టీ అని ఈ సందర్భంగా పలువురు విమర్శిస్తున్నారు!!