Home రాజకీయాలు పూనం – పవన్… కొన్ని ట్విస్ట్ లు!

పూనం – పవన్… కొన్ని ట్విస్ట్ లు!

SHARE

ప్రస్తుత ఏపీ చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ పూనం కౌర్ తాజాగా తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు! ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది! కత్తి మహేష్ – పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన చర్చా కం రచ్చ లో భాగంగా పూనం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో పవన్ తో ఆమెకున్న పరిచయం, స్నేహం కారణంగానే ఆమెకు ఏపీ ప్రభుత్వం ఆ హోదా కట్టబెట్టిందని అప్పట్లో గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూనం చేసిన పోస్ట్ గురించి గమనిస్తే మాత్రం… ఎవరిని టార్గెట్ చేసింది? ఎందుకు టార్గెట్ చేసింది? వంటి కొత్త ప్రశ్నలు లేవనెత్తిన… వాటికి సమాధానాలు కూడా లభిస్తున్నట్లుంది!

తెలంగాణ ప్రభుత్వం తమ చేనేత వస్త్రాలకు స్టార్ హీరోయిన్ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేస్తే.. ఏపీ మాత్రం ఏమి చూసి ఎంపిక చేసిందో తెలియదు కానీ పూనం కౌర్ ని ఎంపిక చేసింది. అనంతరం ఆమె ఎంపిక వెనక పవన్ మాట సాయం, బాబు కృతజ్ఞత ఉన్నాయని కథనాలొచ్చాయి! ఈ క్రమంలో తాజాగా పవన్ – చంద్రబాబుపై నిప్పులు చెరగడం, దాదాపుగా టీడీపీతో బందం తెంపేసుకోవడం తెలిసిన సంగతే! దీంతో పూనం పోస్ట్ కి ఎసరు వచ్చినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు!

దీంతో ఆమె మనసులో ఏమి ఉందో తెలియదు కానీ… “కాన్సెప్ట్ కాపీ చేసి.. డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు.. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..”” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు! ఈ పోస్ట్ పై ఆన్ లైన్ వేదికగా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కాస్త అవగాహన ఉన్నవారు మాత్రం… ఈ వ్యాక్యలు పవన్ ని ఉద్దేశించి చేసి ఉండొచ్చని, దానికి కారణం… బాబు తో పవన్ బందం తెగిపోతే తన పోస్టుకు ఎసరు వస్తుందని బాద అయ్యి ఉండొచ్చని అంటున్నారు!!

ఏది ఏమైనా.. ఎందరో స్టార్ హీరోయిన్ లను కాదని పూనం కౌర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడమే ఒక ట్విస్ట్ అయితే.. ఆ పోస్ట్ వెనక పవన్ మాట సాయం ఉందనేది మరో ట్విస్ట్.. ఆ రెండే భారీ ట్విస్టులు అనుకుంటే.. తాజాగా పవన్ టీడీపీని దూషించిన అనంతరం పూనం ఈ రేంజ్ లో పోస్ట్ పెట్టడం మరో భారీ ట్విస్ట్!! తెరవెనక జరిగే విషయాలు సామాన్యులకు తెలియదు కదా!!