Home రాజకీయాలు జగన్ పరిక్వత.. బాబు మూర్ఖత్వం!!

జగన్ పరిక్వత.. బాబు మూర్ఖత్వం!!

139
SHARE

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఒక సినిమాలో హీరో చెప్పే డైలాగ్! సరిగ్గా ఇప్పుడు జగన్ విషయంలో అదే రిపీట్ అవుతుంది అనే కామెంట్ వినిపిస్తుంది. మాట్లాడితే దేశంలోనే అత్యంత సీనియర్ అని, 40ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు.. యువ నాయకుడు జగన్ కు ఉన్న రిపక్వతలో సగం అయినా లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అసలు బాబు ఉద్దేశ్యం ఏమిటి అనేది సామాన్య మానవుడికి అర్ధంకాని విధంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల సంగతి మాకెందుకు.. జగన్ కు మాత్రం క్రెడిట్ రాకూడదు, మంచి పేరు రాకూడదు అనేది ఒక్కటే ధ్యేయంగా కనిపిస్తుంది!

వివరాళ్లోకి వెళితే… అవిశ్వాసంపై నాలుగు సార్లు నాలుగు రకాల మాటలు మాట్లాడిన చంద్రబాబు.. వైకాపా పెట్టిన అవిశ్వాస సమయం చివరి నిమిషంలో యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అవిశ్వాసం టైం వేస్ట్ అని ప్రకటించడం.. అనంతరం వైకాపా అవిశ్వాస తీర్మాణానికి మద్దతు అని ప్రకటించడం.. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే తూచ్ తూచ్ టీడీపీయే అవిశ్వాసం పేడుతుందని ప్రకటించడం.. వైకాపాను కలుపుకుపోయే విషయంలో క్లారిటీలేకపోవడం.. ఇవన్నీ 40ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడికుండాల్సిన లక్షణాలు కాదనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం జగన్ కున్న పరిక్వత గురించి. టీడీపీ అవిశ్వాసం పెదితే తాము మద్దతు ఇస్తామని, అలా కాని పక్షంలో తాము పెట్టే అవిశ్వాసానికి టీడీపీమద్దతు ఇవ్వాలని నిజాయితీగా కోరారు జగన్. అయితే.. చివరి నిమిషంలో సరే అని ప్రకటించిన చంద్రబాబు… అనంతరం తానే అవిశ్వాస తీర్మాణం పెడతానని ప్రకటించారు. అయితే.. ఈ అవిశ్వాసానికి వైకాపా మద్దతు కావాలని మాత్రం అడగడానికి బాబు కు అహం అడ్డొచ్చిందో లేక మూర్ఖత్వపు అనాలోచిత స్వార్ధపూరిత రాజకీయ ఆలోచనలు అడ్డుతగిలాయో మాత్రం తెలియడం లేదని ప్రజలు భావిస్తున్నారు.

అయితే.. ఈ విషయంలో వైకాపా నేతలు మాత్రం.. టీడీపీ పెట్టే అవిశ్వాసానికైనా సరే.. తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని ప్రకటిస్తుంది. ఈ విషయంలో జగన్ కు ఏమాత్రం అహంలేదని, పరిపూర్ణమైన పరిపక్వత కలిగిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికైనా బాబు తనకున్న వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి.. వైకాపాను కలుపుకుపోయే దిశగా పెద్దన్న పాత్ర వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.