Home రాజకీయాలు బాబు మారలేదు.. అవిశ్వాసంపై మడత!

బాబు మారలేదు.. అవిశ్వాసంపై మడత!

SHARE

ఎవరు ఎన్ని చెప్పినా, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా .. తనకు రాజకీయాలే ముఖ్యమని, క్రెడిట్ గేం తనకు ప్రధానమని మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు! నిన్నమొన్నటివరకూ జగన్ పెడుతున్న అవిశ్వాసం ఒక డ్రామా అని, అసలు కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం అనేది టైం వేస్ట్ వ్యవహారమని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ప్రజా ఒత్తిడికి, జగన్ పట్టువిడవని పోరాటపటిమకు తలొగ్గారు! జగన్ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. పోనీలే.. బాబులో మార్పు ఒచ్చింది, కనీసం ఈ ఒక్క విషయంలో అయినా రాజకీయాలు పక్కనపెట్టి, రాష్ట్రం కోసం ఆలోచించారు అని అంతా భ్రమ పడ్డారు! అది నిజంగా ప్రజల భ్రమే అని కొన్ని గంటల వ్యవధిలోనే తేల్చేశారు చంద్రబాబు.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై ఢిల్లీ వేదికగా పార్లమెంట్ సాక్షిగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైకాపా ఎంపీలు కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాసానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన బాబు… తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. వైకాపా అవిశ్వాసానికి తాము మద్దతు ప్రకటించడం లేదని చెప్పకుండా.. తామే అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ తోట నర్సింహంకు ఆదేశాలు పంపించారు చంద్రబాబు.

అవిశ్వాస తీర్మాణం వైకాపా పెడితే తమ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని, క్రెడిట్ మొత్తం జగన్ కే వెళ్లిపోతుందని భావించారో ఏమో కానీ… తాజాగా తమ ఎంపీలతోనే అవిశ్వాస తీర్మాణం పెట్టాలని నిర్ణయించారు. ఇందులో ఏమి కుట్ర దాగుందనే విషయాలు కాస్త ఆలస్యంగా అయినా వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదనుకోండి… అది వేరే సంగతి. ఎన్డీఏ తో బాబు తెగతెంపులు చేసుకోబోతున్న సంగతి దాదాపు కంఫాం అయిన నేపథ్యంలోనే బాబు ఇలాంటి దైర్యంతో కూడిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ రాజకీయాల సంగతి ఈ ఒక్క విషయంలో అయినా బాబు పక్కనపెట్టి రాష్ట్రంకోసం, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఆలోచించి ఉంటే బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలు జాతీయ రాష్ట్ర పార్టీలతో మంతనాలు జరిపి ఒప్పించుకుని పక్కా ప్లానింగ్ తో సిద్ద పడిన వైకాపాను కాదని, పెట్టామంటే పెట్టాము అన్న విదంగా బాబు ఇప్పటికిప్పుడు ఇలాంటి ఆలోచన చేయడం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు మారలేదు.. కాదు కాదు మారేది లేదు!!