Home రాజకీయాలు చంద్రబాబు చేతకాని సీఎం.. బీజేపీ లాజిక్ ఇదే!!

చంద్రబాబు చేతకాని సీఎం.. బీజేపీ లాజిక్ ఇదే!!

715
SHARE

గతకొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ – టీడీపీ లమధ్య మాటల యుద్దాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో పవన్ ను మాపైకి ఉసిగొల్పుతున్నారు అని టీడీపీ మోడీపై నిప్పులు చెరుగుతుంటే… టీడీపీ అవినీతి త్వరలోనే బయటపెడతామన్న రేంజ్ లో బీజేపీ వ్యాఖ్యానిస్తుంది. ఈ క్రమంలో తాజా పరిణామాలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే శక్తిలేదని అందుకే ఏమీ చేయలేని పరిస్థితిలో కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని మొదలుపెట్టిన నరసింహారావు.. చంద్రబాబు అత్యంత అసమర్ధ ముఖ్యమంత్రి అని తేల్చి చెప్పారు. అందుకు ఉదాహరణగా.. ముఖ్యమంత్రిగా ఉండికూడా 29సార్లు ఢిల్లీ వెళ్లి ఒక్క పని కూడా చేయించుకోలేని విషయాన్ని చూపిస్తున్నారు. ఇన్ని రోజులు కేంద్రంలో భాగస్వాములుగా ఉండి కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేని చేతకాని ముఖ్యమంత్రిగా బాబు మిగిలిపోయారని ధ్వజమెత్తారు నరసింహారావు.

ఇదే క్రమంలో చంద్రబాబు అవినీతిని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించిన ఆయన… బీజేపీని టిడీపీ వీడటంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ వైదొలగడం తమకొక మంచి అవకాశం అని అభిప్రాయాడ్డారు. ఈ సందర్భంగా.. తమ చేతగాని తనాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రేంజ్ లో బీజేపీ నేతలు ఫైరవడం చూస్తుంటే బాబుపై బీజేపీ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.