Home రాజకీయాలు నిజాయితీ కలిగిన పోరాటం అంటే ఇది!

నిజాయితీ కలిగిన పోరాటం అంటే ఇది!

SHARE

సాధారణంగా కేంద్రంలో ఉన్న అధికారపక్షంపై, అత్యంత బలమైన కూటమిపై అవిశ్వాస తీర్మాణం పెట్టాలంటే… అది కూడా ఒక రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఆ సాహసం చేయాలంటే, ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే అది చిన్న విషయం కాదు. అది కూడా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కేంద్రంలో ఉన్న పార్టీ మిత్ర పక్షం అయిన సందర్భాల్లో కూడా! ఒకవేళ ప్రజావ్యతిరేకత, ప్రజా ఒత్తిడి బలంగా ఉన్నా ఆ విషయంపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టే రాజకీయ విమర్శలు చేస్తారు తప్ప.. వీరే స్వయంగా రాష్ట్ర సమస్యను దేశం మొత్తం మాట్లాడుకునే దిశగా నిర్ణయలు తీసుకోరు! ఈ క్రమంలో చారిత్రక నిర్ణయం తీసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ!

ఏ వంక దొరుకుతుందా పోరాటం లైట్ తీసుకుందాం.. జనాలకు మాత్రం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ, నాలుగు గోడల మధ్య మాత్రం రహస్య ఒప్పందాలు, సన్నాయి నొక్కులు నొక్కే రాజకీయ పార్టీలు ఉన్న ఈ రోజుల్లో… వైకాపా ఈ నిర్ణయం తీసుకోవడంపై అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వైకాపా అధినేత తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, పట్టువిడవని విక్రమార్కుడి పోరాట పటిమకు అభినందనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలని ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమతో కలిసి రావాలని టీడీపీ గడువు కోసమే ఆ తేదీని నిర్ణయించినట్లు జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేసిన సంగతీ తెలిసిందే. ఈ విషయంలో పార్లమెంటులో జరుగుతున్న వాయిదాల పర్వాలతో అనుకున్న పని పూర్వదేమో అని భావించిన వైకాపా… అనుకున్న తేదీకంటే ముందే అవిశ్వాసం పెట్టాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. ఇదే క్రమంలో ప్రస్తుతం పార్లమెంటులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమావేశాలను కుదించాలని కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వేగంగా స్పందించి శుక్రవారమే అవిశ్వాసం పెట్టాలని వైకాపా నిర్ణయించింది. ఇక్కడే వైకాపా సిన్సియారిటీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

ఇందులో భాగంగా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలు ఇచ్చారు వైకాపా ఎంపీలు. కాగా.. నిన్నటివరకూ అవిశ్వాసం వల్ల ప్రయోజనం ఏమిటి.. అవిశ్వాసం వల్ల ఒరిగేది ఏమిటి.. సమయం వృధా.. జగన్ ఆడుతున్న డ్రామాలు.. అని కామెంట్స్ చేసిన టీడీపీ కూడా జగన్ నిజాయితీ కలిగిన పోరాటానికి తలొగ్గినట్లు కనిపిస్తుంది! ఇందులో భాగంగా జగన్ నిజాయితీ కలిగిన పోరాటానికి టీడీపీ తాజాగా తన మద్దతు ప్రకటించింది!!