Home రాజకీయాలు బాబు కన్నీటి కథపై వ్యంగాస్త్రాలు!!

బాబు కన్నీటి కథపై వ్యంగాస్త్రాలు!!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని బాబు కన్నీటి చుక్క కార్చారని ఒక వర్గం మీడియా ఆ విషయాన్ని ఒక రేంజ్ లో కాదు కాదు.. వారికి అలవాటైన రేంజ్ లో హైలెట్ చేసే ప్రయత్నం చేసింది అని కామెంట్స్ వినిపిస్తున్న దశలో… ఆ కన్నీటి కథపై వైకాపా అధినేత జగన్, జనసేన అధినేత పవన్ సెటైర్స్ వేశారు! అసలు ప్రత్యేక హోదా రాదని 2016లో అరుణ్ జైట్లీ ప్రకటించినప్పుడే బాబు కన్నీరు కార్చి కనీసం ఆ దిశగా నటించినా ప్రజలు హర్షించేవారు, నమ్మేవారేమో. అయితే జరిగిన దారుణాలకు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలకు ప్రత్యక్ష కారణం అయిన వ్యక్తి తప్పించుకు తిరిగే క్రమంలో, నేరం నాది కాదు అని బొంకే క్రమంలో భాగంగా బావోధ్వేగానికి లోనయ్యారు అని ప్రకటించుకుంటే ఒరిగేది ఏమిటి.. కలిగే ప్రయోజనం ఏమిటి?

ఆ సంగతులు అలా ఉంటే… ఈ విషయాలపై తాజాగా జనసేన అధినేత స్పందించారు. బాబు కన్నీటి కథపై తనదైన ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారంటూ చెప్పుకొస్తున్నారు… మరి గుంటూరులో కలరా వచ్చి చనిపోయినవారిని చూస్తే బాబుకు బాధ కలగలేదా? శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులను చూస్తే ఏమాత్రం బాధకలగలేదా? అని పవన్ సూటిగా ప్రశ్నించారు. మీ పిల్లలైతే ఒక న్యాయం ఇతరుల పిల్లలైతే ఒక న్యాయమా అని ప్రశ్నించిన పవన్… గుంటూరు సభ పుణ్యమా అని బాబుపై విమర్శల వర్షాలు, ప్రశ్నల వర్షాలు కురిపించారు. ప్రచార పత్రికలు, బాకా ఛానళ్లూ బాబు భావోద్వేగం సీన్ ని ఎంత రక్తి కట్టించినా… పవన్ ఒక్క మాటతో బాబు భావోద్వేగ సీన్ పై ప్రశ్నిస్తూనే సెటైర్ వేసారు.

ఇక జగన్ విషయానికొస్తే… ఇదే భావోద్వేగ సీన్ పై జగన్ తనదైన శైలిలో స్పందించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ఆస్కార్‌ రేంజ్‌లో యాక్షన్‌ కట్‌ అనగానే కళ్లలోంచి నీళ్లు కార్చారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం లోక్‌ సభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వరు.. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించరు.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అసెంబ్లీలో మాత్రం మొసలి కన్నీరు కార్చుతున్నారు.. అంటూ ఫైరయిన జగన్… ఇటీవల ప్రకటించిన 90 ఆస్కార్‌ అవార్డుల్లో చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించలేదు.. ఇదేంటబ్బా అని ఆలోచిస్తే.. ఆస్కార్‌ను అందించేది విదేశీ సంస్థలు కాబట్టి వాళ్లు మన రాష్ట్రాన్ని గమనించలేదు. అయినా కానీ… ఆస్కార్‌ అవార్డును ప్రధానం చేసే స్థాయిలో చంద్రబాబు అసెంబ్లీలో నటించారు అని సెటైర్స్ వేశారు!!

ఏది ఏమైనా… బాబు కన్నీటి కథపై, భావొడ్వేగ డ్రామా అని విపిస్తున్న మాటలపై వినిపిస్తున్న కామెంట్స్ బాబు గాలి తీసేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే పోరాడగలిగే శక్తి ఉండి, ప్రశ్నించగలిల్గే స్థాయి ఉండి కూడా అసెంబ్లీల్లోనూ, మండలిలోనూ భావోద్వేగ ప్రసంగాలు చేస్తూ ప్రజలను మభ్యం పెట్టడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటో బాబుకే తెలియాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన పోరాడలేకపోవడానికి వ్యక్తిగత కారణాలు కారణం అయితే సైలంట్ గా ఉండొచ్చు.. చేతకాని తనాన్ని మౌనంతో మాఫీచేయొచ్చు.. అలా కాకుండా పోరాడే పక్షాలపై విమర్శలు చేయడం వల్ల బాబుకు మరింత అప్రతిష్ట కలుగు తుందనేది మరికొందరి అభిప్రాయంగా ఉంది.!