Home రాజకీయాలు లోకేష్ కోసం అభిమానుల ఎదురుచూపులు!

లోకేష్ కోసం అభిమానుల ఎదురుచూపులు!

SHARE

జనసేన ఆవిర్భావ సభలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు – మంత్రి లోకేష్ లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంత సూటిగా మాట్లాడని పవన్ కాస్త వాయిస్ పెంచి లోకేష్ అవినీతిపై గళమెత్తారు! బరితెగించిన అవినీతికి పాల్పడుతున్నారని.. పుత్రుడి అవినీతి బాబుకి కనిపించడంలేదా అని.. చేస్తున్న అవినీతి గురించి నిస్సిగ్గుగా బహిరంగంగా మాట్లాడేటంత బరితెగించేశారని నొక్కి వక్కానించారు.. ఇన్ని జరిగినా, ఇంతలా విమర్శించినా కూడా ఇప్పటివరకూ నారా లోకేష్ స్పందించలేదు!!

తనను తన కుమారుడిని తిట్టడానికే మీటింగ్ పెట్టారా అంటూ పవన్ ను ప్రశ్నించారు చంద్రబబు. తన మంత్రులతో లోకేష్ గొప్పతనం గురించి చెప్పించారు! డబ్బు సంపాదనకోసం లోకేష్ రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ప్రజాసేవ కోసమే వచ్చారని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు నేరుగా ఎమ్మెల్యేగా పోటీచేసి రావొచ్చుకదా అనే కామెంట్స్ సంగతి కాసేపు పక్కనపెడితే… లోకేష్ ను సహచర మంత్రులు బాగానే వెనకేసుకొచ్చారు! ఇన్ని జరిగినా, ఇంతజరుగుతున్నా కానీ.. లోకేష్ మాత్రం ఇప్పటికీ స్పందించలేదు!!

ఎలా స్పందించాలో అర్ధం కాలేదా లేక పవన్ తో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారా అదీ గాక.. ఏమి మాట్లాడితే ఏ విషయం మిత్రుడు బయటపెడతాడో అని భయపడ్డారా… కారణాలు అయితే తెలియలేదు కానీ లోకేష్ స్పందించలేదు!! సాదారణంగా ప్రజాస్వామ్యంలో, అది కూడా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిపై ఈరేంజ్ లో బహిరంగంగా అవినీతికి సంబందించిన విమర్శలు వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరైనా ఇప్పటికే స్పందించాలి. ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి.. ఆమాత్రం కనీస ఆలోచన లేని లోకేష్ ఎక్కడ ఉన్నారనేది అభిమానులకు ఆలోచనగా ఉంది.

ఇంతలా విమర్శించినా, నేరుగా తిట్టినా కూడా మా నాయకుడికి చీమ కుట్టినట్లైనా లేదా.. అసలు స్పందించే లక్షణాలు సన్నగిళ్లుతున్నాయా.. శేఖర్ రెడ్డి కేసు విషయంలో అయినా స్పందించాలి కదా.. బరితెగించిన అవినీతి అనే పెద్ద మాట మాట్లాడినప్పుడైనా మెదలాలి కదా.. అని లోకేష్ అభిమానులు తెగ ఫీలయిపోతున్నారట. మాకున్నంత బాద కూడా లేకుండా భయపడి దాక్కున్నారా అని మరికొందరు కాస్త ఆవేశపడుతున్నారట.

ఎవరు ఏమనుకున్నా… తనపై వచ్చిన డైరెక్ట్ విమర్శలపై ఇప్పటివరకూ లోకేష్ స్పందించకపోవడంపై అభిమానులే కాదు సాదారణ జనాలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు!! ఏమి మాట్లాడాలనే విషయం ఇంకా ప్రిపేర్ కాలేదేమో అని ఆన్ లైన్ వేదికగా సెటైర్స్ కూడా పడిపోతున్నాయి!!