Home రాజకీయాలు విశ్లేషణ: ఎవరి చేతుల్లో ఎవరి భవిష్యత్తు!

విశ్లేషణ: ఎవరి చేతుల్లో ఎవరి భవిష్యత్తు!

SHARE

రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరనేది చాలా పాత విషయం, అందరికీ తెలిసిన విషయమే! ఆ సంగతి అలా ఉంటే.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో భుజాలు భుజాలు రాసుకుని చేతులు కలిపి పైకిత్తి ఫోటోలకు ఫోజులిచ్చిన బీజేపీ – టీడీపీ – జనసేన లు అధికారం చేపట్టి నాలుగేళ్లు అయిన తర్వాత కలహాల కాపురం చేశారు.. తాజాగా కత్తులు దూసుకున్నారు! ఇటు బీజేపీ, జనసేన నేతలు వరుసపెట్టి టీడీపీని టార్గెట్ చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో బీజేపీ – టీడీపీల మద్య ఇంకా బాబు తరుపునుంచి కాస్త సన్నాయి నొక్కులు నొక్కుతున్నా… పవన్ మాత్రం తాజాగా టీడీపీపై కత్తి దూశారు! మరోవైపు నిన్నటివరకూ బాబు కేబినేట్ లో మంత్రిగా ఉన్న ప్రస్తుత మాజీమంత్రి బీజేపీ నేత మాణిక్యాల రావు, బాబుపై ప్రశ్నల వర్షాలు కురిపించారు. స్నేహపూర్వక వాతావారణం ఉన్నసమయంలో వీర్రాజు రూపంలో బాబుకు పక్కలో బల్లెం ఉన్నప్పటికీ, నాలుగేళ్లు మంత్రిగా తన కేబినెట్ లో ఉన్న మాణిక్యాల రావు మీడియా ముందుకు రావడంతో, బాబు బాగోతాలు బయటపెడతారేమో అని తమ్ముళ్లు తెగ టెన్షన్ పడిపోతున్నారట.

ఒక వైపు ఇంతకాలం స్నేహితుడిగా ఉండి పవన్.. బాబు ప్రభుత్వంలో లొసుగులు అన్నీ లాగుతుంటే.. పవన్ వద్ద ఆధారలు ఏమైనా ఉన్నాయోమో అని తమ్ముళ్లు తెగ టెన్షన్ పడుతున్నారట. ఇంతకాలం మిత్రులుగా ఉన్న వారికి బాబు ప్రభుత్వంలో ఉన్న లొసుగులు, జరుగుతున్న అవినీతి సంగతులూ తెలియకుండా ఉండవనేది పలువురి వాదన. అలా తెలియని పక్షంలో ఈ స్థాయిలో నేరుగా పేర్లు చెప్పిమరీ విమర్శలు గుప్పించరనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకాలం కేబినెట్ లో ఉన్న బీజేఫీ మంత్రులకు బాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి తెలియకుండా ఉంటుందా.. ఇంతకాలం రాసుకుపూసుకు తిరిగిన జనసేన అధినేతకు బాబు అండ్ కో ల బాగోతాలపై అవగాహన లేకుండా ఉంటుందా అనేది పలువురి ఎదురుప్రశ్నలుగా ఉన్నాయి.

దీంతో మిత్రుల చేతుల్లో బాబు భవిష్యత్తు పూర్తిగా ఇరుక్కుపోయిందని తెలుస్తుంది. కాస్త గట్టిగా మాట్లాడితే అటు బీజేపీ నేతలతో ఇబ్బంది, కాస్త మెత్తగా మాట్లాడుతుంటే ప్రజలతో ఇబ్బంది, బీజేపీ నేతలను విమర్శించేసి నేరం కేంద్రంపై తోసేస్తుంటే ఇటు జనసేనతో ఇబ్బంది.. మరోవైపు వైకాపా సీరియస్ నెస్ కోల్పోకుండా ప్రత్యేక హోదా గురించి పోరాటం. అయితే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల సంగతి పక్కనపెడితే… కేంద్రంలో మోడీ అండ్ కోల విషయంలో బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారే తప్ప, ఎదురు తిరిగి పోరాడటం లేదు. బీదరుపులు అరుస్తున్నారేతప్ప హక్కుల గురించిన పోరాటం చేయడం లేదు.. మంత్రులను బలిచ్చి తెగ హడావిడి చేశారే తప్ప.. ఎన్డీయే ముందు ఇంకా వినయంగానే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రంపై తెగ పోరాడుతున్నాను అని బాబు చెప్పే విషయాలు కూడా వాస్తవదూరం అనేది జగమెరిగిన సత్యంగానే ఉంది!!

ఈ క్రమంలో ప్రతిపక్షం సంగతి కాసేపు పక్కనపెడితే… పాత మిత్రపక్షాలైన బీజేపీ – జనసేన చేతుల్లో బాబు విలవిల్లాడిపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు!! మరి ఈ విషయంలో బాబు వారికి సరెండర్ అయిపోతారా లేక సీరియస్ గా ఎదురుతిరిగే సాహసం చేస్తారా అనేది వేచి చూడాలి!!

ఇదే క్రమంలో నేరం నాది కాదు బీజేపీది అని వారిపై ఏస్థాయిలో బురద జల్లినా కూడా… బీజేపీకి పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. అలాగే టీడీపీ నేతలంతా జనసేన పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా కూడా పవన్ కు కొత్తగా వచ్చే నష్టం కూడా ఏమీ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో అటు బీజేపీ – ఇటు జనసేనల మధ్య టీడీపీ నలిగిపోయే సూచనలు పుష్కలంగా ఉన్నాయని అర్ధం అవుతుంది!!