Home రాజకీయాలు పవన్ అత్తారింటిపై టీడీపీ వెటకారం!

పవన్ అత్తారింటిపై టీడీపీ వెటకారం!

SHARE

రాజకీయాల్లో ఏక్షణం ఏమైనా జరగొచ్చు… ఇప్పటివరకూ ఒకే కంచంలో తిన్నరేంజ్ లో కలిసిపోయిన నాయకులు సైతం మరుక్షణంలో బద్దశత్రువులైపోవచ్చు. ప్రస్తుతం టీడీపీ – జనసేనల మధ్య ఇలాంటి సంఘటనే జరుగుతుంది. చంద్రబాబుపై నమ్మకం ఉందని, తన సీనియారిటీపై నమ్మకం ఉందని 2014 ఎన్నికల్లో తోడుగా నిలిచిన పవన్.. తాజాగా లోకేష్ అవినీతి పై ఫైరయ్యేసరికి టీడీపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. నిన్నమొన్నటివరకూ పవన్ అంటే తమకు అధికారబిక్ష పెట్టిన వ్యక్తిగా పైకిచెప్పకపోయినా లోలోపల భావించినంత పనిచేసిన టీడీపీ నేతలు.. పవన్ పై వ్యక్తిగత దాడికి వెనకాడటం లేదు.

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రప్రయోజనాలకోసం ఢిల్లీలో రాజకీయ పోరాటం చేస్తూ, కేంద్రం మెడలు ఎలా వంచాలా అని ఆలోచనచేస్తూ, ముందుకు కదులుతుంటే… ఏపీలో మాత్రం టీడీపీ – జనసేనలు ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు. ఇంతకాలం నారా లోకేష్ అవినీతిపై వైకాపా ఎంత మొత్తుకున్నా పట్టించుకోని పవన్.. ఇంతకాలానికి కళ్లు తెరిచారో ఏమో కానీ.. తండ్రీకొడుకులిద్దరినీ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఇదే అదనుగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. పవన్ కు ఇప్పటికి మూడు పెళ్లిల్లు జరిగాయి, ఇప్పుడున్నమె మూడో భార్య అనే ఆలోచనతో “పవన్ కు అత్తారింటికి దారి ఎటో తెలియదు. ఏ అత్త ఇంటికి పోవాలో కూడా తెలియని పవన్‌” అని సంభోదిస్తున్నారు. ఈ మేరకు లోకేష్ పై పవన్ చేసిన విమర్శలతో పవన్ పై దాడికి దిగిన టీడీపీ నేతల్లో వైకాపా గుర్తుపై గెలిచి గోడదూకి మంత్రి పదవి చేపట్టిన ఆదినారాయణరెడ్డి ఈ మేరకు పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు!!

ఏది ఏమైనా… నిన్నమొన్నటివరకూ రాసుకు పూసుకుతిరిగిన టీడీపీ – జనసేనలు ఈ రేంజ్ లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే క్రమంలో జనాలకు అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకాలం టీడీపీ నేతల మనసుల్లో పవన్ పై దాగున్న అభిప్రాయాలు ఒక్కొక్కటిగా ఇలా బయటకు రావడం గమనార్హం!