Home రాజకీయాలు లోకేష్ బరితెగించిన అవినీతిపై పవన్ ఫైర్!!

లోకేష్ బరితెగించిన అవినీతిపై పవన్ ఫైర్!!

SHARE

ఏమి జరిగిందో తెలియదు కానీ.. గుంటూరులో తాజాగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పైనా ఆయన ప్రభుత్వంపైనా విమర్శల వర్షాలు కురిపించారు పవన్. బీజేపీతో టీడీపీ బందం దాదాపు తెగిపోయిన తరుణమే కారణంఆ లేక పవన్ తన సొంత కుంపటిని సిద్ధం చేసుకోవడమే కారణమా అనే రాజకీయపరమైన సంగతులు కాసేపు పక్కనపెడితే… ఇంతకాలం టీడీపీతో ఎంతో సానుకూలంగా, స్నేహంగా ఉన్న పవన్.. తజాగా చంద్రబాబు తనయుడు, ఆయన మంత్రివర్గంలో మంత్రి అయిన లోకేష్ పై విమర్శల వర్షాలు కురిపించారు.

తన ప్రసంగంలో అధికశాతం బాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించడానికే కేటాయించిన పవన్.. ఈ సందర్భంగా లోకేష్ అవినీతిపై ఫైరయ్యారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్తున్నా, ఏ ఒక్కరిని కదుపుతున్నా లోకేష్ అవినీతి గురించిన చర్చే జరుగుతుందని పవన్ విమర్శించారు. లోకేష్ అవినీతి కి అవధులు లేవని మొదలుపెట్టిన పవన్… లోకేష్ అవినీతి వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు.

లోకేష్ అవినీతి మరీ బరితెగించి జరుగుతుందని సూటిగా చెప్పిన పవన్… ఈ సంగతులు మీ దృష్టికి రావడం లేదా అని బాబుపై ప్రశ్నల వర్షాలు కురిపించారు. నిజంగా మీ ప్రభుత్వంలో బరితెగించి జరుగుతున్న అవినీతి మీ దృష్టికి రాకపోతే.. మీకు ప్రభుత్వం ఏమి పట్టున్నట్లు అని ప్రశ్నించారు. ఒకవేళ లోకేష్ అవినీతి గురించి మీకు తెలిసి కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మాత్రం రాష్ట్రానికి మంచిది కాదని పవన్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల కోసం ప్రతీ నియోజకవర్గానికి సుమారు రూ.25 కోట్లు సిద్ధం చేశామని బహిరంగంగా నిస్సిగ్గుగా తమ అవినీతి గురించి టీడీపీ నేతలు చెప్పుకోవడం వారి అవినీతి స్థాయిని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఏదిఏమైనా.. ఇంతకాలం ప్రతిపక్ష వైకాపా, జనాలు, కొందరు జర్నలిస్టులు, బాదితులు చెబుతున్న లోకేష్ బాబు బాగోతం గురించి పవన్ ఇలా సూటిగా విమర్శించడంపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆశక్తిగా మారింది!