Home రాజకీయాలు ఇంగ్లిష్ పేరుచెప్పి బాబుపై పవన్ సెటైర్!

ఇంగ్లిష్ పేరుచెప్పి బాబుపై పవన్ సెటైర్!

SHARE

చాలా సందర్భాల్లో చాలామంది విశ్లేషకులు చెప్పిన మాట… ఢిల్లీకి వినబడాల్సిన మాటలు తెలుగులోనే ఎక్కువగా ఎందుకు మాట్లాడతారు మన నాయకులు అని! దానికర్ధం తమ పోరాటం, తమ మాటలు ఢిల్లీ వరకూ వినిపించకూడదు కానీ.. రాష్ట్ర ప్రజలకు మాత్రం తెగ పోరాడుతున్నామని ఫీలింగ్ కలిగించాలనేది కలరింగ్ అని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలో సాదారణ ప్రజలు మాట్లాడుకునే ఈ కామెంట్ ని బాబుపై అప్లై చేశారు పవన్ కల్యాణ్.

తన ప్రసంగం ప్రారంభమైన అనంతరం.. “కేంద్ర ఆర్ధిక మంత్రి గౌరవనీయులైన అరుణ్ జైట్లీ కోసం కాసేపు ఇంగ్లిష్ లో మాట్లాడతాను.. ఏం ఇంగ్లిష్ లో మాట్లాడటానికి నాకేం భయం.. నేనేమీ దోచుకున్నవాడిని కాదు కదా.. దోచుకున్నవారికి భయం కేంద్రం అంటే.. మీకూ నాకు ఎందుకు భయం” అని కామెంట్ చేశారు పవన్!

అంటే… ప్రసంగం ప్రారంభంలోనే బాబుని టార్గెట్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు పవన్. ఆయన ప్రసంగం ఆధ్యాంతం చంద్రబాబుపై సెటైర్స్ వేస్తూ ప్రశ్నించే దిశగానే సాగడం గమనార్హం. ఏమి చెడిందో, ఎందుకు చెడిందో తెలియదు కానీ… 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బాబుతో రాసుకుపూసుకు తిరిగిన పవన్.. అనంతరం తిరుపతి, కాకినాడ మొదలైన చోట్ల పెట్టిన బహిరంగ సభల్లో కూడా కాస్త స్నేహపూర్వక మాటలే మాట్లాడుతూ సూచనలు చేశారు. ఆయన కొన్ని కామెంట్స్ లో కర్ర ఇరగకుండా పామూ చావకుండా సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే… తాజాగా గుంటూరులో ఏర్పాటుచేసిన సభలో మాత్రం ప్రారంభం నుంచీ ప్రసంగం ముగిసేవరకూ బాబుపై అవకాశం ఉన్న ప్రతీ పాయింట్ లోను వ్యంగ్య బాణాలు సంధిస్తూ, ఘాటైన విమర్శలు చేశారు పవన్!! ఈ కామెంట్స్ అనంతరం ఇకనైనా కేంద్రం గురించి మాట్లాడే మాటలు ఇంగ్లిష్ లో ఢిల్లీ పెద్దలకు వినిపించేలా బాబు మాట్లాడతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా… ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీ లో పోరాటం చేస్తున్నామని, ఢిల్లీ పెద్దలకు వినిపించాలని, కనిపించాలని టీడీపీ ఎంపీలు ఏర్పాటు చేసిన ఫ్లకార్డులు కూడా తెలుగు బాషలోనే ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు!!