Home రాజకీయాలు బాబుపై నారాయణ మార్కు సెటైర్స్!

బాబుపై నారాయణ మార్కు సెటైర్స్!

SHARE

ప్రత్యేక హోదా విషయంలో గత నాలుగేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, ప్రత్యేక ప్యాకేజీ అన్న సమయంలో వ్యవహరించిన తీరు, కేంద్రమంత్రుల రాజీనామాల అనంతరం కూడా ఎన్డీఏలో కొనసాగుతున్నామని ఇచ్చిన స్టేట్ మెంట్స్ అన్నీ కలగలిపి బాబు ఇరుకున పడిన సంగతి తెలిసిందే! ఈ విషయాలపై తాజాగా తనదైన శైలిలో స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించిన నారాయణ.. బాబుపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తూనే సెటైర్స్ కూడా వేశారు.

బీజేపీ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకునే సాహసం చేయలేకపోతుండటానికి.. బీజేపీ అంటే బాబుకి ఉన్న ప్రధాన భయమే కారణం అని నారాయణ తేల్చి చెప్పారు! కేంద్రం నుంచి మంత్రులను తొలగించి ఎండీయేలో కొనసాగుతాం అని బాబు ప్రకటించడంలో పరమార్ధం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తున్నారు నారయణ. ఇదే క్రమంలో బాబు ప్రస్తుతం కారుస్తున్న మొసలి కన్నీరు గురించి తనదైన శైలిలో స్పందించిన నారాయణ.. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని తెలుసుకోవడానికి నాలుగేళ్లు సమయం పట్టిందా అని ప్రశ్నిస్తున్నారు.

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని అభిప్రాయపడిన నారాయణ… ఈ విషయంలో మొసలి కన్నీరు, డ్రామా రాజీనామాల ప్రక్రియ కాకుండా అన్ని పక్షాలను కలుపుకుని సీరియస్ గా తీవ్రంగా పోరాడాలని ఈ సందర్భంగా బాబుకి సూచించారు నారాయణ.

కాగా… ఎవరు ఎన్ని సూచనలు చేసినా, ఎవరు ఎంత పోరాడినా, ఎంత చెప్పినా, రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా చంద్రబాబు మాత్రం తనదైన పంథాలో పోతారని, బీజేపీ విషయంలోనూ, మోడీ విషయంలోనూ ఆయనకుండే వ్యక్తిగత భయాలు ఆయనకున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.