Home రాజకీయాలు పవన్ స్పీచ్ ను స్వాగతించి గిల్లిన కత్తి!

పవన్ స్పీచ్ ను స్వాగతించి గిల్లిన కత్తి!

255
SHARE

గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జనసేన ఆవిర్భావ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున ఈ సభను నిర్వహించటం ద్వారా తమ పార్టీ బలం ఏమిటో తెలియజేయాలని తహతహలాడుతున్న పవన్.. అనుకున్నట్లుగానే జనాలను మొబలైజ్ చేయగలిగారు. ఆ సంగతులు అలా ఉంటే.. ఈ బహిరంగ సభపై ఎప్పుడూ జరగని రీతిలో పాత మితౄలు తెలుగుదేశం నేతలు ఫైరయిపోతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే.. ఈ సభ, పవన్ ప్రసంగంపై కత్తి మహేష్ తనదైన రీతిలో స్పందించారు. పవన్ ను పొగుడుతున్నట్లు పొగుడుతూనే, తనదైన గిల్లుడు పని చేశారు. కావాలని చేస్తున్న విమర్శలుగా అనిపించినా.. ఆలోచింపచేసే విమర్శలు చేసే కత్తి అనే పేరున్న కత్తి మహేష్ తాజాగా పవన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం.

“ప్రత్యేకహోదా కోసం పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే – నేను కూడా జాయిన్ అవుతా” అని ప్రకటించిన కత్తి ఈ మేరకు ట్విట్టర్ లో ఈ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ ను స్వాగతిస్తున్నాను.. చాలా విలువైన నిర్ణయాలు జనసేన అధినేత తీసుకున్నారు.. నిజంగా అభినందనలు! అని మొదలుపెట్టిన మహేష్… దళితులకు ఉపాధి కల్పన, వ్యాపార అవకాశాలు అన్నప్పుడు రాని కేకలు, కాపు రిజర్వేషన్లు అనే సరికి ఎందుకు వచ్చిందో ఒకసారి పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి అని తనమార్కు ట్వీట్ వదిలారు.

ఆ అరుపులు కేకల మధ్య తేడాని గమనించిన కత్తి… క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికీ ఒక్క దళిత రెప్రజెంటేటివ్ కూడా జనసేనలో లేకపోవడం గమనించాలి అని పేర్కొన్నారు. జనసేన కాపు పార్టీ అని ఎందుకు ముద్రపడిందో తెలుస్తుంది.. ఈ సమస్యలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే.. బాగుండేది. ఇన్నాళ్లు లెక్కగట్టి ఈరోజు అప్పజప్పడం వల్ల ఏమి లాభం. ఓహ్…ఎన్నికలు కదా మన లక్ష్యం! మంచిదే. కనీసం ఒక లక్ష్యం ఏర్పడింది” అంటూ తనదైన గిల్లుడు వ్య్ఖ్యలు చేశారు కత్తి!

ఏది ఏమైనా.. పవన్ విషయంలో కత్తి తనదైన శైలిలో ఆన్ లైన్ లోనూ ఆఫ్ లైన్ లోనూ స్పందించడం మామూలే. అయితే.. కత్తి చేస్తున్న విమర్శల్లోనూ, సంధిస్తున్న ప్రశ్నల్లో చాలా విషయం దాగి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!! పవన్ ఫ్యాన్స్ అర్ధం చేస్తుకుంటే… కత్తి, పవన్ కు అనధికారిక రాజకీయ సలహాదారుడు అనే కామెంట్స్ కూడా ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేయడం కొసమెరుపు. అర్ధం చేసుకోండి.. జనసేన కార్యకర్తలు అనేది కత్తి ఫ్యాన్స్ మాట!!