Home రాజకీయాలు పవన్ సూచనలు పెడచెవిన పెట్టిన ఫ్యాన్స్!

పవన్ సూచనలు పెడచెవిన పెట్టిన ఫ్యాన్స్!

263
SHARE

సరిగ్గా పవన్ కల్యాణ్ ఏ విషయంపై బయపడ్డాడో, మరే విషయంపై అభిమానులకు సూచనలు చేశాడో సరిగ్గా అదే విషయం జరిగింది. జనసేన నాలుగో వార్షికోత్సవం నేపథ్యంలో ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశం ప్రారంభమైన కాసేపటికే తొక్కిసలాట జరిగింది! అయితే ఈ క్రమంలో ఈ వేడుకలకు వచ్చే అభిమానులకు జనసేన తరఫున ముందుగానే సూచనలు చేశారు అధినేత. సరిగ్గా ఆ సూచనల్లో ఏ విషయాలైతే పొందుపరిచారో, సరిగ్గా అదే విషయాలపై తొక్కిసలాటలు జరిగాయని అంటున్నారు సభాస్థలిలోని జనాలు!

ఎంతో క్రమశిక్షణగా ఉండాల్సిన జనసేన కార్యకర్తలు.. మహిళల గ్యాలరీల్లోకి వెళ్లడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది! ఈ సందర్భంగా అభిమానులను అదుపుచేసే క్రమంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదే సందర్భంలో.. అభిమానుల గ్యాలరీల్లో కూడా వారికి వారికీ మధ్య తోపులాటలు బలంగా జరిగాయి. అభిమానుల తోపులాటలతో బారికేడ్లు కూలిపోయాయి. ఈ సందర్భంగా గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

జనసేన కార్యకర్తలు అని చెప్పుకునే వారిలో చాలా మందికి ఓటు హక్కు కూడా రాని యువకులే అని పేరుంది! ఈ క్రమంలో సినీనటుడిని చూడటానికన్నట్లు ఎగబడిన యువత.. మహిళల గ్యాలరీల్లోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించండి అని పవన్ ఎన్ని చెప్పినా జరిగేవి ఇవే కావడం గమనార్హం.

కాగా… అభిమానులకు సూచనలు అంటూ పవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కొన్ని ముఖ్యమైన సూచనలు ఇలా ఉన్నాయి…

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగించకుండా వారికి దారి ఇవ్వాలి..

పోలీసులతో – ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి..

ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాని నిలబెట్టండి.

ప్రజలని గౌరవించండి. వారితో దురుసుగా ప్రవర్తించకండి.

సభాస్థలిలో శాంతంగా ఉండండి – సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి.

చెట్లు – గోడలు – టవర్లు – స్పీకర్ల పైకి ఎక్కకండి.