Home రాజకీయాలు జగన్ మాటలు వినిపించాయా బాబు?

జగన్ మాటలు వినిపించాయా బాబు?

SHARE

బీజేపీ వల్ల రాష్ట్రానికి మామూలు మేలు జరగదు, కేంద్రంలో మోడీ పీఎం అవుతారు, రాష్ట్రంలో బాబు సీఎం అవుతారు.. ఇక ఏపీ అభివృద్ధిని ఆపేవారే లేరు. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడానికి వీరిద్దరి సహకారం అద్భుతంగా పనిచేస్తుంది. బాబు అనుభవం ఇప్పుడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆ అనుభవంతో నవ్యాంధ్ర అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానానికి చేరుతుంది. ఇవన్నీ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు మైకుల ముందు ఊదరగొట్టిన మాటలు. అయితే తాజాగా మోడీ మనసు మీద, బాబు శక్తి సామర్ధ్యాల మీద జనాలకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ సమయంలో నేరం నాది కాదు అని సైడయిపోయే క్రమంలో బీజేపీతో కటీఫ్ అని ఒక కొత్త డ్రామాకు తెరలేపారు చంద్రబాబు. సరే వారి స్నేహం వారిష్టం కానీ.. మధ్యలో జగన్ పై బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారు.

ఏ వంకా లేనమ్మ డొంకట్టుకుని వేలాడిందన్నట్లు… బీజేపీతో తమ స్నేహం పోయిందన అనంతరం, జగన్ బీజేపీతో స్నేహం కోసం ప్రాకులాడుతున్నారని ప్రచారం చేయడం మొదలు పెట్టారు బాబు అండ్ కో. ఢిల్లీలో జగన్ బ్యాచ్ మోడీ చుట్టూ తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాలపై సైలంట్ గా ఉన్న జగన్ తాజాగా మరోమారు తనకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని దానికోసం ఎంత దూరం అయినా వెళ్తానని, ఎవ్వరినైనా ఎదురిస్తానని, సలాం చేస్తూ గులాం గిరీ చేయాల్సిన పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సహకరిస్తే మంచిది.. సహకరించకపోయినా కూడా కేంద్రంపై అవిశ్వాసం పెట్టి తీరుతాం అని మరోమారు క్లారిటీ ఇచ్చారు జగన్.

నిజంగా చంద్రబాబు అండ్ కో చేస్తున్న విమర్శల్లో వాస్తవం పాలు కాస్తైనా ఉంటే… ఇప్పటికే నేరం ఫుల్ గా బాబుకు చుట్టుకున్న తర్వాత జగన్ మోడీతో స్నేహం చేసుకుని పబ్బం గడుపుకోకుండా, కేంద్రంపై అవిశ్వాసం పెట్టే స్థాయికి ఎందుకు వెళ్తారు. అంటే… ఇక్కడ జగన్ కు వ్యక్తిగత ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం అవుతుంది. నిజంగా బాబుకు మోడీ అంటే భయం లేకపోతే… జగన్ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొచ్చు కదా!! మోడీ కన్నెర్ర చేస్తారనే భయం బాబు సొంతం. ఆయన పోరాడరు, పోరాడేవారిపై బురద జల్లుతారు అనే విమర్శలు బాబుపై రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

బాబు అండ్ కో అర్ధం లేని విమర్శలను లైట్ తీసుకున్న వైకాపా ఒకవైపు అవిశ్వాసానికి సిద్ధం అవుతోంటే.. మద్దతు ఇచ్చేది ఎలాగూ లేదు సరికదా.. మూలన కుర్చున్న ముసలమ్మ మూలుగులు మూలుగుతున్నారు టీడీపీ నేతలు. అవిశ్వాసం నెగ్గుతుందా? టైం వేస్ట్ తప్ప సాధించేది ఏముంది? జగన్ డ్రామా ఆడుతున్నారు..? అంటూ.. చంద్రబాబు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. తాను పోరాడలేరు సరికదా పోరాడే జగన్ ను వెనక్కి లాగడం, విమర్శించడం ఎందుకో బాబుకే తెలియాలి. చేతనైతే హోదా కోసం జరిగే పోరాటానికి మద్దతు ఇవ్వాలి, లేకపోతే చేతకాని తనానికి సైలంట్ గా అయినా ఉండాలి. కానీ పోరాడే వారిపై ఇలా బురద చల్లడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అయితే జగన్ మాత్రం.. అవిశ్వాసానికి తెదేపా కూడా మద్దతు ఇస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఏపీలో ప్రధానమైన రెండు పార్టీలూ ఐక్యంగా హోదా కోసం గళమెత్తుతున్నాయనే విషయం కేంద్రానికి కచ్చితంగా డిఫెన్స్ లో పాడేసే అంశం అవుతుందనేది జగన్ వాదన. అయితే జగన్ తీసుకున్న ఈ స్టెప్ తో అటు బీజేపీతో స్నేహం కోసం ఆరాటపడుతున్నారనే విమర్శకు చెక్ పెట్టడంతోపాటు, ప్రత్యేక హోదా అంశంపై తనకున్న నిజాయితీని, గట్టి పోరాట పటీమను నిరూపించుకున్నట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయిటే ఈ పోరాటానికి బాబు సహకరిస్తారా లేక మోడీ కంటీకి కనిపించకుండా కొలుగులోకి వెళ్లిపోతారా అనేది వేచి చూడాలి!!