Home సినిమా తెలుగు అమ్మాయిలని ప్రోత్సహించరు.. పక్కలోకి రమ్మంటారు

తెలుగు అమ్మాయిలని ప్రోత్సహించరు.. పక్కలోకి రమ్మంటారు

SHARE

యాక్ట్రెస్ శ్రీ రెడ్డి మల్లిడి ఏ ఫిలిం బై అరవింద్2 లో ప్రేక్షకులను పలకరించింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలానే చెప్పింది శ్రీరెడ్డి, చాలామంది మనసుల్లో ఉన్న మాటలను.. చాలా నిష్కర్షగా నిర్మొహమాటంగా బైటపెట్టేసింది. ఏకంగా ఆఫర్ల కోసం ఎంత మంది పక్కల కింద నలిగాలో.. అలా చేసినా ఆఫర్ వస్తుందో లేదో అంటూ సంచలన వాక్యాలు చేసింది.

అవకాశాల కోసం వాళ్ల దగ్గర వీళ్ల దగ్గర పడుకోవాల్సి రావడంతో పాటు.. ఇండస్ట్రీలో బ్రోకర్లుగా వ్యవహరించే హీరోలు కూడా ఉన్నారని అంటోందీమె. తెలుగు అమ్మాయిలు అనేసరికి చిన్నచూపు చూస్తారని.. వాడుకున్నాక కూడా హీరోయిన్ పాత్రను ఇవ్వరని.. ఇస్తే గిస్తే వారికి ఓ చిన్న పాత్రతో సరిపెడతారని అందరికీ పక్క భాషల భామలే కావాలని తన ఆవేదన చెప్పింది శ్రీ రెడ్డి.

ఇంకా.. పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుగు గురించి అన్ని లెక్చర్స్ ఇస్తుంటారు కదా. అందరికి సహాయం చేస్తానని చెబుతారు కదా. మరి మీకు తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వాలని అనిపించడం లేదా ? కనీసం మీ సినిమాలో రెండవ హీరోయిన్ గా కూడా తెలుగు అమ్మాయికి ఎందుకు ఛాన్స్ ఇవ్వరు. నిజంగా పవన్ కళ్యాణ్ మీకు కానీ మనసుంటే కనుక మీరు తెలుగు అమ్మాయిలకి ఆఫర్లు ఇచ్చి విలన్లను తెలుగు వారిని పెట్టుకొని, టెక్నీషన్స్ ని కూడా తెలుగువారిని పెట్టి అప్పుడు మాట్లాడండి సార్.. నాకు భయం లేదండి. నన్ను కొట్టేస్తారా మీ అభిమానులు. మీ అభిమానుల వలన ఒకప్పుడు కట్టి మహేష్ కూడా ఇబ్బంది పడ్డారు. మీరు ఒకవేళ ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా పెట్టండి.

చివరికి విలన్స్ ని కూడా ఎక్కడి వాళ్ళనో తీసుకుంటున్నారు కానీ మన తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవడం లేదు. అంతెందుకు సపోర్టింగ్ యాక్టర్స్ ని కూడా మీరు తెలుగు వాళ్ళని తీసుకోవడం లేదు. మీరు పైకి వచ్చింది తెలుగు ఇండస్ట్రీ మీద. మీరు ఈ స్థాయిలో ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజల వలన.. అని అడుగుతుంది శ్రీ రెడ్డి.