Home రాజకీయాలు ఈఎంఐ కట్టలేక.. 2 ఎకరాల్లో 25కోట్ల ఇల్లు!!

ఈఎంఐ కట్టలేక.. 2 ఎకరాల్లో 25కోట్ల ఇల్లు!!

SHARE

ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాకపోయినా కూడా అప్పుడే పూర్తిస్థాయి రాజకీయ నాయకుల లక్షణాలు పవన్ కి వచ్చేశాయి అంటూ ఆన్ లైన్ వేదికగా సెటైర్లు పడుతున్నాయి! దీనికి కారణం.. పవన్ చెబుతున్న మాటలకు చేస్తున్న చేష్టలకు సంబందం లేకపోవడమే అనేది నెటిజన్ల వాదన. ఈ విషయంలో తాజాగా పవన్ చేపట్టిన ఇల్లు, జనసేన కార్యాలయాల నిర్మాణాలే సాక్ష్యాలుగా చూపిస్తున్నారు నెటిజన్లు!

వివరాళ్లోకి వెళ్తే… నవ్యాంద్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న ఖాజా టోల్ గేట్ కి అతి సమీపంలో హైవేకి దగ్గర్లో పవన్ తన ఇంటి, ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు రెండు ఎకరాల సువిశాల స్థలంలో ఇల్లు జనసేన కార్యాలయం నిర్మించేందుకు పవన్ సతీసమేతంగా శంకుస్థాపన చేసి పునాదిరాయి వేశారు. అయితే ఈ రెండు నిర్మాణాలు పూర్తయ్యేందుకు దాదాపుగా రూ.25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంపైనే పవన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమాలు వరుసగా ఫ్లాపులవుతున్నాయి.. మరోవైపేమో అసలే డబ్బులు లేవు అని పవన్ ఈమధ్య బహిరంగ సభల్లోనే చెప్పిన సంగతి తెలిసిందే! ఆ సంగతులు అలా ఉంటే.. ఈఎంఐ కట్టలేక తన కారు కూడా అమ్మేశానని పవన్ కొద్ది రోజుల క్రితం వెల్లడించారు కూడా. ఈ క్రమంలో కారు ఈఎంఐ కట్టలేక కారు అమ్మేశిన పవన్ అమరావతి చేరువలో.. 2 ఎకరాల స్థలంలో.. సుమారు రూ.25-30 కోట్లతో ఇంటినిర్మాణం చేపట్టడం.. ఎక్కడైనా సింక్ అవుతున్నాయా ఈ మూడు మాటలు! ప్రశ్నించడానికి వచ్చానని చెబుతున్న పవన్ ను ఈ మేరకు.. “ఆ నిర్మాణాలకు అయ్యే ఖర్చుకు డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో చెప్పాలని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

పవన్ మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతుందనడానికి ఈ నిర్మాణాలే సాక్ష్యాలని చెబుతున్న నెటిజన్లు… పవన్ ఆర్ధిక పరిస్థితిపై ఈనెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. పవన్ తనకున్న ఆస్తుల వివరాలు కూడా బహిరంగ పరచాలని, ప్రజాజీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆమాత్రం పారదర్శకత అవసరమని నొక్కి వక్కానిస్తున్నారు. మరి పవన్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈ విషయాలపై క్లారిటీ ఇస్తారా లేక… ఇవితప్ప అన్నీ మాట్లాడతారా అనేది వేచి చూడాలి!!