Home సినిమా అన్న కోసం అమెరికా నుంచి ఎన్టీఆర్ వస్తాడా?

అన్న కోసం అమెరికా నుంచి ఎన్టీఆర్ వస్తాడా?

118
SHARE

ఎన్టీఆర్ చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తున్నాయి, కెరీర్ పరంగా ప్రస్తుతం మహర్దశలో కొనసాగుతున్నాడు. త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలలో నటించేందుకు ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ తో కలసి రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఎన్టీఆర్, చరణ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాడీ షేపప్ తో, మాంచి లుక్ సంతరించుకునే పనిలో వున్నాడు ఎన్టీఆర్. ఇదంతా త్రివిక్రమ్ ఇంకా రాజమౌళి సినిమాల కోసం. ఈ లుక్ ను కొన్నాళ్లు కాస్త సస్పెన్స్ లో వుంచాల్సిన అవసరం వుంది. సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎంత డెడికేషన్ చూపిస్తాడో కుటుంబ బంధాలకు కూడా అంతే విలువ ఇస్తాడు. అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ అన్న కోసం ఇండియా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఆడియో వేడుక కోసం త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. సోదరుడి ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరైతే అభిమానులకు పండగే.

అన్న కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎమ్ఎల్ఎ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 17న ప్లాన్ చేసారు. తాజాగా హే ఇందు లిరికల్ సాంగ్ ను కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. విని ఎంజాయ్ చేయండి