Home రాజకీయాలు మాణిక్యాలరావు బాబుని టార్గెట్ చేశారుగా!

మాణిక్యాలరావు బాబుని టార్గెట్ చేశారుగా!

SHARE

ఇంతకాలం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉండి తాజాగా రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాల రావు తాజాగా స్నేహదర్మం అనే లక్షణ రేఖ పోవడంతోనో ఏమో తెలియదు కానీ… బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకాలం అసేంబ్లీ సాక్షిగా ఇవే ప్రశ్నలు ప్రతిపక్షం కురిపిస్తుంటే మౌనాన్నే తమ బాషగా చేసుకుని కూర్చున్న ఏపీ ప్రభుత్వం లోని బీజేపీ మంత్రులు తాజాగా మనసులో మాట బయటపెట్టడం మొదలు పెట్టారు.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇంతకాలం ప్రజలతరుపున పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్షం వైకాపా నేతలు ఏ ప్రశ్నల వర్షాలు ప్రభుత్వంపై కురిపించారు ఇప్పుడు అవే ప్రశ్నలు మాణిక్యాల రావు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఆత్మవంచన చేసుకుని అధికారపక్షంలో భాగమైనందుకు మౌనంగా ఉన్నారో ఏమో తెలియదు కానీ… తాజాగా ప్రత్యేక హోదా నినాదం చంద్రబాబు ఎత్తుకోవడం వెనక ఉన్న రహస్యం చెప్పుకొస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారనే భయంతో మాత్రం చంద్రబాబు హోదా నినాదాన్ని ఎత్తుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు మాణిక్యాలరావు.

ఇదే క్రమంలో ఏపీకి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు చంద్రబాబు వల్ల వచ్చినవి కాదని క్లారిటీ ఇచ్చిన ఈ బీజేపీ నేత.. ఏపీకి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు ప్రధాని మోడీ వల్ల వచ్చినవేనని ఆయన చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా కియామోటార్స్ ని ప్రస్థావిస్తున్నారు మాణిక్యాల రావు. ఇదే అదనుగా బాబుపై ఫైరయిన మాణిక్యాల రావు… ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరిగిన సీఎం చంద్రబాబు రాష్టానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని సూటి ప్రశ్న సంధించారు.

ఏది ఏమైనా… మిత్రధర్మం అనే లక్ష్మణరేక చెరిగిన తర్వాత ఇంతకాలం కేబినెట్ లో ఉండి అన్ని విషయాలను గమనించిన బీజేపీ నేతలు ఇప్పుడు బయటకు వచ్చి బాబు విషయాలన్నీ సూటిగా ప్రశ్నిస్తూ, ఇలా జనాలకు క్లారిటీ ఇవ్వడంతో బాబు మరింత ఇరుకున పడే అవకాశాలు పుష్కలంగా పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా.. కేబినేట్ లో ఉన్నంత కాలం పెద్దగా మాట్లాడినట్లు కనిపించని మాణిక్యాల రావు సైతం బాబుని టార్గెట్ చేసి విషయమున్న ప్రశ్నలు సూటిగా సంధించడం గొప్ప విషయమే. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడలి మరి!!