Home రాజకీయాలు ల్యాండ్ డీల్…. మళ్లీ మొదలైపోయిందిగా!

ల్యాండ్ డీల్…. మళ్లీ మొదలైపోయిందిగా!

SHARE

తాను మాట్లాడే ప్రతీ మాటకీ తనవద్ద సాక్ష్యాలు ఉంటాయన్నంత రేంజ్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడే కత్తి మహేష్.. కాస్త గ్యాప్ తర్వాత మరలా పవన్ పై కత్తి దూశారు. సాధారణ ప్రజానికం చాలా క్యాజువల్ గా మాట్లాడుకునే మాటలను ట్విట్టర్ వేదికగా సంచలనంగా మారుస్తుంటారు కత్తి మహేష్. సందర్భం దొరికిన ప్రతిసారీ అటు మోడీపైనా, ఇటు చంద్రబాబు పైనా విమర్శలు గుప్పించే మహేష్.. పవన్ విషయంలో అయితే విమర్శల వర్షాలే కురిపిస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా పవన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ నిర్మాణానీకి సంబందించి సంచలన కామెంట్స్ చేశారు. ఆ పూజా కార్యక్రమానికి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సంగతి నుంచి ప్రధాన కార్యక్రమం వరకూ తనదైన శైలిలో స్పందించారు కత్తి.

* బీజేపీ-తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో జనసేన అధినేత ఇల్లు.. జనసేన పార్టీ ఆఫీస్ నిర్మాణం.. అభినందనలు.

* పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ల్యాండ్ డీల్ నాకు ఇస్తే, పవన్ కళ్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతి షిఫ్ట్ అవ్వడానికి నేను రెడీ!

ఇలా మెల్లగా మొదలుపెట్టిన కత్తి మహేష్… అనంతరం కాస్త డోస్ పెంచి.. “జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజురి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం.” అని ట్వీటారు.

అయితే… ఉన్నట్లుండి పవన్ పై మహేష్ ఈ రేంజ్ లో ఫైరవడానికి కారణం ఏమిటనేది పెద్ద ప్రశ్నగా ఉంది! గతంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కాస్త రాజీకి వచ్చి స్వీట్లు తినిపించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పవన్ పై కత్తి దూశారు మహేష్.

ఈ ట్వీట్లలో పవన్ కి ఇచ్చిన ల్యాండ్ డీల్ అన్న విషయంపై మహేష్ మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది పలువురి అభిప్రాయంగా ఉంది. కత్తి త్వరలోనే ఆ ల్యాండ్ డీల్ పై క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నారు మహేష్ అభిమానులు!! అయితే ఈ సంచలన ట్వీట్లపై జనసేన కార్యకర్తలు కానీ, పవన్ అభిమానులు కానీ ఇంకా స్పందించకపోవడం గమనార్హం!!