Home రాజకీయాలు బాబు పాలన ఫలితం.. రైల్వే జోన్ కు రెడ్ సిగ్నల్!!

బాబు పాలన ఫలితం.. రైల్వే జోన్ కు రెడ్ సిగ్నల్!!

619
SHARE

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మెతకవైఖరి అవలంబిస్తే రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనే విషయం మరోసారి స్పష్టం అయ్యింది. ఈ విషయాలపై మరోమారు క్లారిటీ ఇచ్చిన అంశం రైల్వే జోన్! అవును.. ఇంతకాలం ఢిల్లీ వెళ్లి విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడి వస్తున్నాం.. కేంద్రం అంతా రెడీ చేస్తుంది అని కబుర్లు చెప్పిన ఏపీ నేతలకు షాకిచ్చేలా రైల్వే జోన్‌‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీకి రైల్వే జోన్‌ లేనట్టేనని తేల్చిసింది. రైల్వేజోన్‌ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ దినేష్‌ కుమార్‌ కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ మేరకు స్పష్టం చేశారు.

దీంతో ఏపీ వాసులకు రెండు క్లారిటీలు వచ్చినట్లయ్యింది. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ఏపీకి అందించడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, మరొకటి ఇంతకాలం ఏపీ ముఖ్యమంత్రి వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరి ఇందుకు ప్రధాన కారణం అని!! నిన్నమొన్నటివరకూ హోదా విషయంలో కాస్త టెక్నికల్ అంశాలు ఇబ్బంది పెడుతున్నా… విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ విషయంలో మాత్రం అసలు డోకా లేదు అని చెప్పుకున్న ఏపీ సీఎం.. ఈ విషయాలపై ఏమంటారనేది వేచి చూడాల్సిన అంశం.

అయితే.. కేంద్ర కేబినెట్ లో ఉంటే అన్నివిషయాలపైనా పోరాటం చేయలేము, ఇకపై ఎంపీలుగా ఫ్రీ అయిపోయాం కాబట్టి తెగ పోరాడతాం అని చెప్పుకున్న మాజీ కేంద్రమంత్రుల స్పందన కూడా తెలియాల్సి ఉంది. ఎండీఏ తో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటే రాష్ట్రానికి మంచిది కాదని సన్నాయి నొక్కులు నొక్కిన ఏపీ సీఎం.. ఎండీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారో వేచి చూడాలి.

ఇప్పటికైనా జగన్ తో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తారా.. జగన్ కు కలుపుకుని అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తారా అలా కాకుండా బీజేపీని నాలుగు తిట్లు తిట్టి, మైకుల ముందు తెగ ఫీలయిపోయి సైలంటుగా ఉంటారా అనే అంశం ఇప్పుడు చాలా ముఖ్యం!! ఇప్పటివరకూ కేంద్రం నుంచి వచ్చిన పథకాలు, నిధులు అన్నీ పోరాడి తెచ్చుకున్నాం అని చెప్పుకునే టీడీపీ నేతలు… రాని వాటి విషయంలో మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు అని చెప్పుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత అని చెప్పుకునే చంద్రబాబు… ఎలాంటి ఒత్తిడి తెస్తే, ఎలా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవచ్చో తెలియక పోవడం ఏపీ ప్రజల దురదృష్టం. దీంతో మాటలకు చేతలకు ఉన్న వ్యత్యాసం ఇలాంటప్పుడు స్పష్టం అవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.