Home రాజకీయాలు ఇది బీజేపీ వారి సరికొత్త బాహుబలి

ఇది బీజేపీ వారి సరికొత్త బాహుబలి

SHARE

ఇక 2019 సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అందుకే అన్ని పార్టీలు ఎన్నికల నాగారాను అప్పుడే మోగించాయి. అధికార బీజేపీ అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోంది. భాజపా వేసిన భారీ స్కెచ్ లో ఒక బాహుబలి లాంటి సినిమా వుంది.

అచ్చంగా నిజమే. తమ ప్రచారానికి బాగా పనికి వచ్చేలా ఒక సినిమా రూపొందించనుంది. బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ ని అందుకు భారీ నజరానా ఇచ్చి మారి బుక్ చేసుకుంది.

విషయానికొస్తే RSS  నేపధ్యం తో ఒక డాక్యుమెంటరీ సినిమా ని బీజేపీ ప్లాన్ చేసింది. పట్టణాలకు పల్లెలకు తాము చేసింది చేయబోయేది ఈ సినిమాలో చూపబోతున్నారు. అంతేనా ఈ డాక్యుమెంటరీ బడ్జెట్ వింటే అవాక్కవ్వాల్సిందే. నూరు కోట్ల బడ్జెట్ తో ఎన్నికల ప్రచార సినిమా.

ఈ చిత్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడడం నించి ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలను కళ్లకు కట్టినట్టు చూపించనున్నారట. చెప్పాలీ అంటే కొత్త తరాన్ని RSS కి దగ్గరచేసే విధంగా రూపొందించబోతున్నారని వినికిడి.

ఇందులో బాలీవుడ్‌కు చెందిన స్టార్స్ నటించనున్నట్లు సమాచారం. ఎవరు దీనిని డైరెక్ట్ చేస్తారనేది ఇప్పటికి సస్పెన్స్. అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి కల్లా బీజేపీ సినిమా వెండితెరపై చూడొచ్చు.