Home రాజకీయాలు ఆ సత్తాలేకపోతేనే అవకాశం!!

ఆ సత్తాలేకపోతేనే అవకాశం!!

921
SHARE

మామూలుగా రాజ్యసభ సీట్లు ఎవరెవరికి ఇస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆయా పార్టీల అధినేతల అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఆ పార్టీ అధినేత ఏ విషయాన్ని రాజ్యసభ సీటుకు అర్హత అని భావిస్తారో ఆ అర్హత పుష్కలంగా ఉన్నవారిని అందుకు ఎంపిక చేస్తారు. ఈ విషయంలో మిగిలిన పార్టీల అధినేత్లా సంగతి అటుంచితే.. చంద్రబాబు ఏ విషయాన్ని అర్హ్తగా భావిస్తారో, మరే అనర్హతను అర్హతగా చూపిస్తారో తాజాగా ఒకవిషయం ద్వారా వెలుగులోకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే… రాజ్యసభ సీట్ల విషయంలో ఆశావహులందరితోనూ తాజాగా చంద్రబాబు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేశారంట. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన బీద సోదరులు మస్తాన్‌రావు, రవిచంద్రలతో సుమారు అర్ధగంట మాట్లాడి బుజ్జగించారంట చంద్రబాబు. ఈ బుజ్జగింపుల్లో బాబు వదిలిన రెండు మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారయనే చెప్పాలి. ఈ సోదరులను బుజ్జగించడనైకి ప్రధాన కారణం… బీద మస్తాన్ రావు రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకోవడమే. అయితే వీరిని బుజ్జగించే క్రమంలో… మీకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే గెలిచే సత్తా ఉంది. మీరు రాజ్యసభకు వెళ్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కావలికి మళ్లీ అభ్యర్థిని వెదుక్కోవాల్సి వస్తుంది. వీటికన్నా ఆ ఎన్నికలే ముఖ్యం కదా!

ఆ మాటలు సరిగ్గా గమనిస్తే… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా ఉన్నవారికి బాబు రాజ్యసభ సీటు ఇవ్వరన్నమాట అని అంటున్నారు విశ్లేషకులు! అంటే ఇప్పటివరకూ బాబు రాజ్యసభకు ఎంపిక చేసిన వారంతా ఆ సత్తాలేనోళ్లే అనే అర్ధం వస్తుందనేది మరికొందరి విశ్లేషణ! సీఎం రమేష్ రాష్ట్రంకోసం ఢిల్లీలో ఎంతో పోరాటం చేసిన కారణంగా రెండోసారి అవకాశం కల్పించానని అక్కడ చెప్పి, లాయర్ గా పార్టీకి ఎన్నో సేవలు చేసిన కారణంగా రవీంద్ర కుమార్ కు అవకాశం కల్పించానని ఇక్కడ చెప్పిన చంద్రబాబు… బీద సోదరులతో మాత్రం… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా ఉన్న మీకు రాజ్యసభ సీట్లు ఇవ్వలేను అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి.

ఈ విషయాలను సీఎం రమేష్ కు అప్లై చేసిన కొంతమందైతే… సీఎం రమేష్ కు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా స్థానికంగా లేని కారణంగా మరో ఆప్షన్ లేక రాజ్యసభకు పంపుతున్నారా అని బాబుకు ఎదురుప్రశ్నల్ వేస్తున్నారు!! ఏది ఏమైనా… రాజ్యసభ సీట్ల వ్యవహారం మరోసారి బాబు మైడ్ సెట్ పై జనాలకు ఒక క్లారిటీ ఇస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు!