Home రాజకీయాలు బాబుపై అపనమ్మకం.. టెన్షన్ పెరిగిపోతుందట!

బాబుపై అపనమ్మకం.. టెన్షన్ పెరిగిపోతుందట!

2647
SHARE

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రోజు రోజుకీ మారిపోతున్న పరిణామాలు, పడిపోతున్న పార్టీ పరువు, మారుతున్న అధినేత ప్రవర్తన ఈ అన్ని అంశాల నడుమ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడిపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రజామద్దతు సంపాదించడం అంత ఈజీ పని కాదని, ఎవరికైనా ఆ ఆశ నిన్న మొన్నటివరకూ ఉన్నప్పటికీ… తాజా పరిణామాల నేపథ్యంలో అది పగటి కలే అనేది వారి మాటగా ఉంది. ఈ క్రమంలో అధినేత అయినా ఒక మాట ఇస్తారేమో అని తమ్ముళ్లు తెగ ఆశగా చూస్తున్నారట.

విషయానికొస్తే… ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకీ పడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుభవం కలిగిన వ్యక్తిగా కుర్చీ ఎక్కిన చంద్రబాబు గత నాలుగేళ్లుగా చేసింది శూన్యం అనేవారే ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో సైకిల్ దిగిపోవడానికి పలువురు తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారట. అయితే ఈ విషయాలపై ఇప్పటికే బాబు సీనియర్లతో చర్చలు కొనసాగిస్తున్నారట. ఇప్పటికే బాబు చేయించుకున్న తన సొంత సర్వే లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 40మంది టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏమీ బాగాలేదని తేలిందంట. ఈ క్రమంలో ఉన్నవారిలో 40 మంది పరిస్థితి అలా ఉండగా.. మిగిలిన వారిలో చాలా వరకూ సైకిల్ దిగిపోవడానికి చూస్తున్నారనేది కొత్త టెన్షన్ గా చెబుతున్నారు.

అయితే ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ తమ్ముళ్లు సైకిల్ దిగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉండటం, దానికి తోడు వైకాపా నుంచి గోడదూకిని ఎమ్మెల్యేలతో ఇంటర్నల్ పోటీవాతావరణం పెరిగిపోనుండటంతో సిట్టింగులు మరో ఆలోచనలో పడ్డారట. అయితే ఈ విషయంలో.. రాబోయే ఎన్నికల్లో సిట్టింగుల స్థానాలకు ఏమీ ఢోకా ఉండదనే క్లారిటీ కనీసం సగంమంది ఎమ్మెల్యేల కైనా ఇస్తే బెటరని పలువురు సీనియర్లు బాబుకు సూచిస్తున్నారట. అయితే ఈ విషయంలో అలాంటి వాగ్ధానం చేయడానికి బాబు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని తెలుస్తుంది.

ఒకవేల బాబు అలాంటి వాగ్ధానమే చేసినా కూడా సిట్టింగు ఎమ్మెల్యేలు ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మే అవకాశాలు అతి తక్కువ అంటున్నారు. దానికి తాజా ఉదాహరణగా వర్ల రామయ్య రాజ్యసభ సీటు విషయాన్ని ప్రస్థావిస్తున్నారట. పాపం సిట్టుగుల టెన్షన్ బాబుకు అర్ధం అయితే బాగుండు అని తమ్ముళ్లు కోరుకుంటున్నారట. ఈ విషయాలపై క్లారిటీ ఇస్తే తమ బ్రతుకేదో తాము చూసుకుంటాం కదా.. చివరి వరకూ ఊరించి చివర్లో హ్యాండ్ ఇస్తే అటూ ఇటూ కాకుండా పోతామని సిట్టింగులు తెగ ఫీలయిపోతున్నారట. ఏది ఏమైనా.. తమ్ముళ్ల టెన్షన్ సైకిల్ దిగిపోవడానికి ప్రధాన కారణం కావొచ్చనేది విశ్లేషకుల మాటగా ఉంది.