Home రాజకీయాలు గుంటూరు గొట్రు – జగన్ రెడీ నా??

గుంటూరు గొట్రు – జగన్ రెడీ నా??

2653
SHARE

జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాను దాటుతోంది. YSR జిల్లా ఇడుపులపాయ లో  నవంబరు లో మొదలైన జగన్ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో జరుగుతోంది. పాదయాత్ర ని ఏ నాడూ ఆపకుండా నిరాటంకంగా కొనసాగించటం నిజంగా గొప్పే. మాజీ సీఎం డా వైస్సార్ గారు ఉన్న పరిస్థులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ కి వున్నా కష్టాలు ఆనాడు వైస్సార్ గారికి ఖచ్చితంగా లేవు. అయినా వెరవకుండా జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాడు.

ప్రకాశం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలలో జగన్ పాదయాత్ర సాగింది. నెల్లూరులోనూ తొమ్మిదినియోజకవర్గాలలో ప్రజాసంకల్పయాత్ర సాగింది. మొత్తంగా ఇప్పటివరకూ దాదాపు యాభై అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జగన్ యాత్ర సాగింది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను కూడా జగన్ ప్రకటించటం చూసాం .

ఇక ప్రకాశం అయినా వెంటనే జగన్ యాత్ర గుంటూరు జిల్లాలో. పాదయాత్ర ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే గుంటూరులో మరో ఎత్తు. 2014లో గుంటూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు కాదు ఆ తరవాత వచ్చే జిల్లాలు అయిదింటిలోను పార్టీ కి బాగా దెబ్బ కొట్టింది. ఈ దెబ్బ వల్లే వైసీపీ అధికారం లోకి రాకుండా జగన్ ని అడ్డుకుంది.

ప్రత్యేక హోదా విషయం కానీ ఇంకా అమరావతి విషయం లో కానీ అధికార తెలుగుదేశానికి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కమ్మ సామాజిక వర్గం అధికంగా కల గుంటూరు లో జగన్ యాత్రను ఎన్నో కళ్ళు గమనిస్తాయి. సర్వేర్య్ లు చేసే సంస్థలు కూడా జగన్ గుంటూరు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాయి. గుంటూరు ఘాటుకి జగన్ దగ్గర ఏం మాటల మంత్రం ఉందా అని చూస్తున్నాయి.

కోస్తాంధ్ర జిల్లాల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పెంచటం జగన్ కు పెద్ద సవాల్ ఈ నేపథ్యంలో రాయలసీమ దాటి ప్రజాసంకల్ప యాత్ర కోస్తాఆంధ్ర కి ఎంటరవుతున్న జగన్ కు ప్రజలు ఇచ్చే స్పందన పట్ల సవత్రా ఉత్కంఠ నెలకొని వుంది!!