Home రాజకీయాలు పార్థసారధి ప్రశ్నల వర్షం ఇదిగో!

పార్థసారధి ప్రశ్నల వర్షం ఇదిగో!

285
SHARE

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం అత్యంత సహజం.. అయితే గత కొంతకాలంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న విధానం, అనుసరిస్తున్న విధానలపట్ల ఎదురవుతున్నవి విమర్శలు కాదు.. సూటి ప్రశ్నలు! అవును.. అజ్ఞానంతో చేస్తున్నారో, లేక అతి తెలివితో చేస్తున్నారో.. అదీగాక జనాలకు అంత జ్ఞానం లేదులే అనే భ్రమలో చేస్తున్నారో తెలియదు కానీ… గత కొంత కాలంగా చంద్రబాబు అత్యంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఇది అతితెలివి తాలూకు పని అని కొందరంటుంటే.. చివరాఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అని మరికొందరి అవగాహన. ఆ సంగతులు అలా ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు ప్రశ్నల వర్షాలు కురిపించారు. ఈ ప్రశ్నలు ఏవో మేధావులు అడిగినట్లు, లేక రాజకీయ కోణంలోనో లేవు సుమా… సాదారణ ప్రజలకు వచ్చిన అనుమానాలు, ఎదురైన ప్రశ్నల స్థాయిలోనే ఉంటాయి. ఆ ప్రశ్నలను ఒకసారి గమనిద్దాం…

మంత్రులు రాజీనామాలు చేస్తారంట… కానీ ఎన్డీయేలోనే కొనసాగుతారట.. ఇది మోసం కాదా.. ఇంతకన్నా మోసం ఉంటుందా?

రాజధాని కోసం వేలాది మంది రైతులు త్యాగాలు చేస్తే.. ఆ త్యాగాన్ని నీ వ్యక్తిగత ప్రతిష్టగా క్యాష్‌ చేసుకోవడం లేదా?

29సార్లు ఢిల్లీ వెళ్లామని, అందర్ని కలిశానని, తెగ కష్టపడ్డానని చెబుతున్నారు కదా.. అన్నిసార్లు వారితో కలిస్తే వారి ఆలోచన ఏంటో తెలియలేదా?

ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా అసెంబ్లీ సీట్లు పెంచండి, ప్రాజెక్టుల అంచనాలు పెంచండి అనే ప్రశ్నలు తప్ప మరొకటి అడిగారా?

ఇకనైనా వైకాపా చేసే పోరాటాలకు అండగా ఉంటావా? ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉంటావా?

ఈ రేంజ్ లో ప్రశ్నల వర్షాలు కురిపించారు పార్థసారధి. ఇదే పనిగా బాబుకు “వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌” అని ఒక బిరుదు కూడా కట్టబెట్టారు ఈ వైకాపా నేత.