Home రాజకీయాలు 98శాతం అంటే మరీ అతిగాలేదా?

98శాతం అంటే మరీ అతిగాలేదా?

226
SHARE

పైసా విషయానికి రూపాయి హడావిడి చెయ్యొచ్చు, భజనా చెయ్యొచ్చు కానీ.. అది మరీ అతిగా ఉండకూడదు! వినేవాళ్లు ఏమనుకుంటారు, జనాలు నవ్వుతారేమో అనే ఆలోచన కాస్తైనా ఉండాలి. ఈ విషయంలో వెనకా ముందూ చూడకుండా భజనకే సిగ్గేసే స్థాయిలో, హడావిడే చిన్నబుచ్చుకునే స్థాయిలో చెలరేగిపోతున్నారు టీడీపీ నేతలు. భజన చేయడం మొదలుపెడితే మాకంటే ఎవరూ బాగా చేయలేరు అనే స్థాయిలో తమ్ముళ్లు తమ పార్టీ అధినేత చంద్రబాబు ముందు చెలరేగిపోయారట.

విషయానికొస్తే… తెలుగుదేశం పార్టీలో వ్యూహ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు తాజాగా ఆ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారంట. ఈ సందర్భంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్న వ్యవహారంపై ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పాలని వారిని కోరారట. దీంతో బాబు తీసుకున్న నిర్ణయం మామూలుది కాదు అని భజన చేయడానికి సదావకాశం లభించిందని ఫిక్సయిన తమ్ముళ్ళు ఉన్నపలంగా చెలరేగిపోయారంట. ఏపీ ప్రజల్లో సుమారు 98శాతం మంది తమరు తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనల వర్షాలు కురిపిస్తున్నారని, ఈ 98శాతం ప్రజలు బాబు తీసుకున్న నిర్ణయం నభూతో నభవిష్యతి అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారని తమ అధినేతకు తెలియజెప్పారట.

అయితే… ఇక్కడ గమనించాల్సిన సంగతి ఒకటుంది. చంద్రబాబు బీజేపీతో బందం తెగిపోయింది అని చెప్పుకుంటున్నా… చివరాకరి దశలో మంత్రి పదవులకు రాజీనామాలు చేసినా ఇంకా ఎండీయే లో కొనసాగుతానని చెప్పడంపట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రుల స్థానాల్లో ఉండే ఏమీ సాధించలేని నేతలు, సాదారణ ఎంపీలుగా ఉండి ఉద్దరించేది ఎంతశాతం అనేది వారికున్న మరో అనుమానం. ఇంతకాలం సన్నాయినొక్కులు నొక్కి ప్రజాగ్రహం తారాస్థాయికి వెళ్తున్న తరుణంలో మరో గత్యంతరం లేక చేసిన రాజీనామాలపట్ల జనాలు మరీ ఈ రేంజ్లో హర్షాతిరేకాలు ప్రదర్శిస్తుంటారా… అనేది మరికొందరి అనుమానం!

ఏది ఏమైనా… ఇక్కడ బాబు తన భజన బృందం చేసిన భజన మైకం నుంచి బయటకు వచ్చి.. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఇంతకూ బాబు బృధం చెప్పిన 98% ప్రజల మాటను ఏ సర్వే ప్రకారం చేశారు.. సుమారు ఐదుకోట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న పెద్దలెవరు.. ఇవికూడా బాబు వీలైనంత క్లియర్ గా తెలుసుకుంటే మంచిది!