Home రాజకీయాలు ఈ తెలివి టీడీపీ సొంతం!

ఈ తెలివి టీడీపీ సొంతం!

475
SHARE

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… ఏపీ టీడీపీ నేతలు, తెలివి తామొక్కరి సొంతమే అనే భ్రమలో బ్రతుకుతారేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి!! అదీగాక తమ మాటల అర్ధాలు, చేతల్లో లేని పనితం జనాలకు అర్ధం కాదులే అని భ్రమపడుతుంటారో!! ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై దొందూ దొందే అయిన టీడీపీ – బీజేపీలు రాజీనామాల ఎపిసోడ్ లు జరిపారు. మీము రాజీనామా చేస్తామంటే.. మీకంటే ఒకడు ముందే మేమూ రాజీనామా చేస్తాం అని హడావిడి చేసి పని కానిచ్చేశారు. దానివల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి అని అంటే.. మౌనమే వారి సమాధానం!! ఆ రాజీనామాల్లో అధిష్టానాలపైనా, పార్టీ అధినేతలపైనా భయమో గౌరవమో కనిపిస్తున్నాయే తప్ప.. రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం మాత్రం శూన్యం!

ఈ విషయంలో టీడీపీ నేతల వాదన మరోలా ఉంది! ముందుగా చెప్పుకున్నట్లుగానే తెలివి తామొక్కరి సొంతమే అనుకునే కొందరు నేతలు.. రాష్ట్ర బీజేపీ నేతలపై కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలోని బీజేపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి పోరాడాలాని, అప్పుడు కానీ కేంద్రంలోని పెద్దలకు హోదా సీరియస్ నెస్ అర్ధం కాదని చెప్పుకొస్తున్నారట!! రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఒత్తిడి వస్తుంది అని చెబుతున్న టీడీపీ నేతలు, ఢిల్లీలో చేసింది ఏమిటి అనే విషయం మరిచిపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కేవలం మంత్రి పదవులకు మాత్రమే రాజీనామాలు చేసిన టీడీపీ నేతలు, బీజేపీతో దోస్తీ అలానే ఉంటుందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సంగతులు అలా ఉంటే… మంత్రులుగా రాజీనామాలు చేసేసాం కాబట్టి ఇపుడు హోదాపై పోరాడటానికి బలం వస్తుందని కొత్త లాజిక్కులు చెబుతున్నారు సుజనా చౌదరి! కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లోనూ, వాటి అమలులోనూ, లేదా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలని ప్రభావితం చేయడం లోనూ.. కేంద్ర మంత్రికి ఎక్కువ అవకాశం ఉంటుందా, కేవలం ఎంపీగా ఉంటే ఉంటుందా? ఏమో సుజనా లెక్కల ప్రకారం అయితే ఎంపీకే బలమెక్కువ!! ఇదే సమయంలో పోరాడాలనుకున్నప్పుడు ప్రభుత్వంలో ఉండకూడదు అనే మరో విషయం చెబుతున్న టీడీపీ నేతలు… స్నేహ బందంలో ఉండి పోరాడొచ్చని చెప్పడం కొసమెరుపు!! తెలివి టీడీపీ నేతల సొంతం అంటే ఇదేనేమో!!