Home రాజకీయాలు బాబు మార్కు మోసం ఈ రేంజ్ లో ఉంటుంది!

బాబు మార్కు మోసం ఈ రేంజ్ లో ఉంటుంది!

SHARE

గత రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఢిల్లీ వేదికగా ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నారు! ఈ పోరాటాల్లో ఎవరిది పోరాటం, ఎవరిది డ్రామా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే… చంద్రబాబు తెలివి తేటలు, రాజకీయ రంగస్థలం పై ఆయనకున్న అద్భుతమైన నాటకానుభవం మాత్రం మరోసారి తేటతెల్లమైంది అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తన ఇద్దరు మంత్రులను రాజీనామాలు చేయిస్తున్నామని, తద్వారా తమ ఆవేదనను బీజేపీ పెద్దలకు అర్ధం అయ్యేలా చెబుతామని చెప్పుకొచ్చారు. ఇది విన్న జనాలు చాలా మంది… బాబు మారిపోయినట్లున్నారు, రాజకీయా స్వార్ధ ప్రయోజనాలకోసం చూడకుండా.. అన్యాయం చేసింది అని చెబుతున్న బీజేపీకి దూరంగా జరుగుతున్నారు అని భావించారు.

అంతా అనుకున్నట్లుగానే అత్యుత్సాహం విషయంలో అవార్డులు దక్కించుకోవడానికి పరిపూర్ణ అర్హత ఉన్న కొన్ని తెలుగు న్యూస్ ఛానల్లు, బాకా పత్రికలు ఆ విషయాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు, చంద్రబాబు బీజేపీపై బలమైన ఒత్తిడి తెస్తున్నారు, హోదా అంశం సీరియస్ అయిపోయింది, వచ్చినా వచ్చేస్తుంది అనే రేంజ్ లో స్పెషల్ బులిటెన్స్ ప్రసారాలు చేశారు. బాబు మాటలు సులువుగా నమ్మేసే కొందరు జనాలు.. అదంతా నిజమనే భావించారు. తర్వాత కదా తెలిసింది బాబు గారి మార్పు, పోరాటం, నిస్వార్ధ రాజకీయాం అంతా ప్రజల భ్రమలని!!

తెదేపా మంత్రులు కేవలం మంత్రి పదవులకు మాత్రమే రాజీనామాలు చేశారట. కానీ ఎన్డీయేలో మాత్రం భాగస్వాములుగానే ఉంటారట. నిన్న మొన్నటివరకూ బీజేపీతో కటీఫ్ చేసుకుంటే కేసులు పెడతారా.. పెట్టుకోనివ్వండి.. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను అని ఢాంబికాలు పలికిన చంద్రబాబునాయుడు.. సుజనా, అశోక్ గజపతి రాజు ల మంత్రిపదవులను బలిచ్చి.. బీజేపీ భుజంపై మాత్రం చేయి అలానే ఉంచి మరోసారి తన భయాన్ని బయటపెట్టుకున్నారు.. ఏపీ ప్రజలను మోసం చేశారు!! అదేవిదంగా బాబు సర్కారు కేసుల భయంతో వణికిపోతున్నారని వినిపిస్తున్న కామెంట్స్ కు మరింత బలం చేకూర్చారు.

మంత్రి పదవులు వదిలేసుకుంటే ఎంత, కొనసాగితే ఎంత? ప్రత్యేక హోదా కోసం తాము చాలా చేశామని రాబోయే ఎన్నికల్లో ప్లెక్సీలు వేసుకోవడానికి తప్ప ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? దానివల్ల మోడీ ప్రభుత్వం మరో ఇద్దరు ఎంపీలకు పదవులు ఇచ్చుకుంటుంది. దానివల్ల బీజేపీకి ప్లస్సే తప్ప మైనస్ కాదు. ఎందుకంటే… త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లకు కేంద్ర మంత్రివర్ఘంలో చోటిచ్చి.. దాన్ని కూడా రాజకీయ ప్రయోజనంగా వాడుకుంటారు. అంటే… ఏపీ టీడీపీ మంత్రుల రాజీనామాల వల్ల బీజేపీకి ఒక రకంగా ప్లస్సు అయినట్లే. బాబు బీజేపీపై పెంచుతానన్న ఒత్తిడి ఇదన్న మాట. తన ఎంపీలను మాత్రం అదే ఎన్డీయే కూటమిలో ఉంచడం అనే నిర్ణయం డ్రామా కాక మరేమిటి! ఎవరి ప్రయోజనాల కోసం చంద్రబాబు ఈ నిర్ణయం>

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తొలినుంచి స్వార్థ ఎజెండాతోనే పావులు కదుపుతున్నారనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే.. చంద్రబాబుకి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీపైనే మోజెక్కువ. కాకపోతే జనాలు, జగన్ అంతా హోదా గొప్పతనంపై అధిక ఆశలు పెట్టుకోవడం, తీవ్ర పోరాటాలు చేయడంతో మరో గత్యంతరం లేక రాజీనామాల డ్రామాకు తెరలేపారు చంద్రబాబు. మంత్రి పదవులకు మాత్రం రాజీనామా చేసి.. ఇంకా కూటమిలో కొనసాగడం అనేది బాబు మార్కు నైతికత అని అనుకోవాలే తప్ప బీజేపీపై పెరిగే ఒత్తిడి ఏమీ ఉండదు, రాష్ట్రానికి ఒరిగేదీ ఉండదు!! నిన్నటివరకూ ఈ రాజీనామాల సీన్స్ చూసి, హడావిడి చూసి.. చంద్రబాబు మారిపోయారా ఏమిటి అనుకున్నవారంతా… ఇది భ్రమ మాత్రమే.. బాబు ఏమీ మారలేదు.. అదే మోసం, అదే దగ, అదే అనైతికత… బాబు మోసం చేస్తే ఈ రేంజ్ లో ఉంతుంది మరి!!