Home రాజకీయాలు సంతకం పెట్టు.. మద్దతు తీసుకో.. పొత్తుపై జగన్

సంతకం పెట్టు.. మద్దతు తీసుకో.. పొత్తుపై జగన్

706
SHARE

ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో తాము మద్దతు ఇస్తామని జగన్‌ స్పష్టంచేశారు. హోదా ఇవ్వని పార్టీలతో కలిసే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసే అవకాశం లేదన్నారు. వైసీపీ అన్ని ఆప్షన్లను తెరిచే ఉంటుందన్నారు.

ఎవరైనా సరే తొలుత హోదాపై సంతకం చేసిన తర్వాతే మద్దతు ఇస్తామన్నారు. అందులో మరో ఆలోచనలే లేదన్నారు. హోదా విషయంలో తమ పార్టీ నిక్కచ్చిగా ఉంటుందన్నారు.

ఏపీ  నుంచి వైసీపీ తరపున 25 మంది ఎంపీలను గెలిపించాలని కోరారు. బీజేపీపై వైసీపీ గట్టిగా మాట్లాడడం లేదంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడుతున్నది.. కేంద్రం తీరును నిరసిస్తూ రాజీనామాలు చేస్తున్నది టీడీపీ ఎంపీలా, వైసీపీ ఎంపీలా అని జగన్‌ ప్రశ్నించారు.

చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయి.. సొంత మీడియాను బాగా అభివృద్ధి చేసుకున్నారని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు మాత్రం ఎన్ని తప్పుడు పనులు చేసినా, దేశంలో ఎక్కడా లేని విధంగా అవినీతి చేసినా సరే ఆయన మీడియా మాత్రం మా చంద్రబాబు మంచోడు అంటూ వెనుకేసుకొ’స్తోందదన్నారు.

ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇచ్చి కొంటున్నా సరే చంద్రబాబు చేస్తున్నది గొప్ప కార్యం అనే స్థాయికి మీడియా దిగజారిపోవడం అత్యంత దురదృష్టకమని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వైసీపీ పెట్టే అవిశ్వాసతీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వాలన్నారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తే దేశం మొత్తం సమస్యను గుర్తిస్తుందన్నారు జగన్.