Home రాజకీయాలు ఆంధ్రజ్యోతి ప్రతినిధులను నిలదీసిన జగన్..

ఆంధ్రజ్యోతి ప్రతినిధులను నిలదీసిన జగన్..

2244
SHARE

కేంద్రం నుంచి మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు. టీడీపీ మంత్రులు రాజీనామా చేయడం ప్రజా విజయమన్నారు.

ప్రజాగ్రహానికి చంద్రబాబు తలొగ్గకతప్పలేదన్నారు. ఈసందర్భంగా మీడియాప్రతినిధులను పరిచయం చేసుకున్న జగన్.. ప్రెస్‌మీట్‌కు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ వారిని తాము ఎప్పుడో బహిష్కరించామని.. ప్రెస్‌మీట్లకు రావొద్దని సూచించామన్నారు. అయినప్పటికీ ప్రెస్‌మీట్‌కు రావడం సరైన పద్దతి కాదన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు చేసే అలవాటు ఆంధ్రజ్యోతికి ఉందన్నారు. అందుకే ఆంధ్రజ్యోతిపై కేసులు కూడా వేశామన్నారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్లో వచ్చే వార్తలను నమ్మవొద్దని పిలుపునిచ్చామని చెప్పారు.

తాము బహిష్కరించిన తర్వాత కూడా ప్రెస్‌మీట్లకు రావడం సరైన పద్దతి కాదన్నారు. ఎలాగో వచ్చారు కాబట్టి ఈసారి మాత్రం ప్రెస్‌మీట్‌లో పాల్గొనాలని .. మరోసారి మాత్రం వైసీపీ ప్రెస్‌మీట్లకు రావొద్దని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు జగన్ స్పష్టం చేశారు.