Home రాజకీయాలు బీజేపీ స్టార్ట్… టీడీపీ ఉలిక్కిపాట్.!

బీజేపీ స్టార్ట్… టీడీపీ ఉలిక్కిపాట్.!

758
SHARE

మిత్రధర్మంలో భాగమని అనుకున్నారో లేక బాబుని బ్లైండ్ గా నమ్మారో తెలియదు కానీ… ఇంతకాలం కేంద్రం అందించిన పథకాలు, ఇచ్చిన నిధుల విషయంలో పెద్దగా పట్టించుకున్నట్లు లేదు కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ కేంద్రం నుంచి వచ్చిన పథకాలు, నిధులు చాలా వరకూ తప్పుదోవపడుతున్నాయని, క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటుందని.. ఎన్ని చేసినా కూడా రెక్కలు విరిచి ఎగరమంటున్నారని కేంద్రంపై బురదజల్లుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి చెప్పినా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు ఢిల్లీ బీజేపీ పెద్దలు!! అయితే ఈ విషయంలో తెగదెంపుల అనంతరం కాస్త కాన్సంట్రేషన్ పెట్టినట్లున్నారు!!

తెగదెంపులు, రాజీనామాల అనంతరం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారయని చెప్పుకోవాలి. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసింది శూన్యం, ఇచ్చిన సున్నా అని చెబుతున్న టీడీపీ నేతలకు సరైన సమాధానాలు చెప్పాలి, వాస్తవాలు ప్రజలకు తెలియ చేయాలి, ఏయే ప్రాజెక్టుల్లో పనులు ఎలా జరుగుతున్నాయి, డబ్బుల ఖర్చులో అవకతవకల పరిస్థితి ఏమిటి అనే అంశాలపై లెక్క తేల్చాలనుకున్నారో ఏమో కానీ… తాజాగా కేంద్రం నిధులతో ప్రారంభమైన ప్రాజెక్టుల పరిశీలనకు ముందుకు కదిలారు బీజేపీ నేతలు. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు అండ్ కో లు గుంటూరు మంగళగిరి ఎయింస్ నిర్మాణపనులను పరిశీలించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయాలపై టీడీపీ నేతలు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. ఇన్నిరోజులూ లేనిది ఇప్పుడు ఉన్నట్లుండి పరిశీలనలకు వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరే.. ఇంతకాలం లేదు ఇప్పటికైనా చేస్తున్నారనేది ప్రజల సంతోషం అయితే.. టీడీపీ నేతల ఉలికిపాటు మాత్రం మరోలా ఉంది. బీజేపీ నేతలు ఇలా పరిశీలనకు వెళ్లడం ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలకు అన్నీ తెలుసు అని పాత చింతకాయ పచ్చడి డైలాగులు చెబుతున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, గమనిస్తున్నారు అనే విషయం టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి వారు చెప్పడం సంగతి కాసేపు పక్కనపెడితే… బీజేపీ నేతల పరిశీలనపైనా, సందర్శనలపైనా ఉలికిపడటమే కొత్త అనుమానాలకు తావిస్తుంది. అంటే… ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసినా ఏపీ టీడీపీ నేతలు ప్రజలకు చెప్పలేదని బీజేపీ బాదా లేక.. ఏపీకి బీజేపీ చాలా చేసింది కానీ బాబు బయటపడనీయలేదని చెప్పాలనో కానీ.. బీజేపీ బృందాలు మాత్రం ప్రాజెక్టుల పరిశీలనలపై ఫుల్ కాన్సట్రేషన్ పెట్టారనే అనుకోవాలి. ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాలి మరి!!