Home రాజకీయాలు నన్ను వాడుకుని వదిలేశారు- పవన్

నన్ను వాడుకుని వదిలేశారు- పవన్

SHARE

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన…రాజకీయ నాయకులకంటే మాఫియానే నయమని వ్యాఖ్యానించారు. మాఫియా మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని రాజకీయ పార్టీలు మాత్రం ఆ పనిచేయలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు.

2014 ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ వాడుకుని తనను వదిలేశాయని తాను కూడా భావిస్తున్నానని చెప్పారు. టీడీపీ, బీజేపీలు తనను చిన్న పిల్లాడిలా చూస్తున్నాయన్నారు. తనపై ఐటీ అధికారులను కూడా ఉసిగొల్పారని పవన్ చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేసిన పవన్‌ ఇప్పుడు మాత్రం వైసీపీ అవిశ్వాసంతో ఉపయోగం లేదని వ్యాఖ్యానించడం విశేషం.

కేంద్రమంత్రులు ఇప్పుడు రాజీనామా చేసినా ఏం ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం తరహాలో హోదా కోసం ఉద్యమం జరగాలన్నారు. 2019 ఎన్నికల్లో తన స్టాండ్ ఏంటో ఈనెల 14 జరిగే గుంటూరు సభలో వివరిస్తానని చెప్పారు పవన్‌. పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం లేనందున తాను ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేసినా ఉపయోగం ఉండదన్నది తన అభిప్రాయమన్నారు.