Home రాజకీయాలు ఇదే జరిగితే కెసిఆర్ మూడో ఫ్రంట్ మొగ్గలోనే మటాష్!!

ఇదే జరిగితే కెసిఆర్ మూడో ఫ్రంట్ మొగ్గలోనే మటాష్!!

157
SHARE

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య పాత్రికేయుల సమావేశంలో ప్రత్యామ్నాయ మూడో ఫ్రంట్ ప్రభుత్వ౦ ఆవశ్యకత ఉందని చెప్పడం మనకి తెలిసిందే. అది బిజెపి, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ౦ అని కూడా అన్నారు.

ఇలా కెసిఆర్ ప్రకటన వచ్చిందో లేదో ఆలా మద్దతు కూడా వచ్చింది. మమతా బెనర్జీ, అజిత్ జోగి, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా అన్ని మూలాల నుండి కెసిఆర్ ఆలోచన కి మద్దతు లభిస్తోంది.

ఇక మూడో ఫ్రంట్ దిశగా ప్రాణిలకులు సిద్ధం అవటం కూడా విన్నాం. కెసిఆర్ ఢిల్లీ లో విశ్రా౦త ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో, ప్రభుత్వేతర సంస్థలతో చర్చలు జరపనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న కేంద్రం అప్రమత్తమైంది. కేసీఆర్ కదలికలపై అప్పుడే నిఘా పెట్టారట. అంతేనా మొగ్గలోనే మూడో ఫ్రంట్ ఆలోచన తుంచేసే విధంగా కెసిఆర్ లక్ష్యంగా సహారా స్కామ్లో ఇరికించే ప్రయత్నాలు మొదలుపెట్టిందని వినికిడి.

2006 లో అప్పటి యూనియన్ లేబర్ మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు సహారా గ్రూపుకు మేలు కలిగే విందంగా కెసిఆర్ నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వున్నాయి.

కెసిఆర్ నిర్ణయం వల్ల సహారా గ్రూపుకు 7000 కోట్ల లబ్ది చేకూరింది అనే అభియోగం వుంది. ఇక కెసిఆర్ ని   ఈ కేసులో బుక్ చేయడానికి మళ్లీ  సిబిఐ తో దర్యాప్తు చేయించాలని కేంద్రం యోచిస్తోంది. ఇది జరిగితే మూడో ఫ్రంట్ మొగ్గలోనే మటాష్!!