Home రాజకీయాలు పవన్‌ వద్దకు తీసుకెళ్తామంటూ జనసేన నేత మోసం.. భారీ బంగారం స్వాహా

పవన్‌ వద్దకు తీసుకెళ్తామంటూ జనసేన నేత మోసం.. భారీ బంగారం స్వాహా

SHARE

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ నేత బాలాజీ భారీ మోసం బయటపడింది.పవన్‌ కల్యాణ్‌ పట్ల అమ్మాయిలకు ఉన్న ఇష్టాన్ని వాడుకుని ఏకంగా మూడున్నర కిలోల బంగారం దోచేశాడు. బాలాజీ ఏలూరులో జనసేన నేతగా చెలామణి అవుతుంటాడు.

నగరంలో భారీగా ఫ్లెక్సీలు, హోల్డింగ్‌లు ఏర్పాటు చేయిస్తుంటారు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో విస్రృతంగా ప్రచారం చేసుకుంటుంటాడు. ఆ ఫోటోలను ఎరగా వేసి జనసేనలో తనకు పలుకుబడి ఉందంటూ అమ్మాయిలను ట్రాప్‌ చేసేవాడు.

అలా ఫేస్‌ బుక్‌ ద్వారా ఏలూరులోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను వలలో వేసుకున్నాడు. అమ్మాయితో పరిచయం పెంచుకుని.. ఆ తర్వాత ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు దిగాడు. ఆఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానంటూ   బ్లాక్‌మెయిల్ మొదలుపెట్టాడు. ఇలా ఆ అమ్మాయి నుంచి మూడున్నర కిలోల బంగారం దోచేశాడు.

ఆ బంగరాన్ని తాకట్టు పెట్టి మరో జనసేన నేత బాలుతో కలిసి తరుచూ గోవాకు వెళ్లడం, జూదం ఆడడం వంటి విలాసాలకు దిగాడు. మోసం చేసిన సాధించిన డబ్బుతో నగరంలో పెద్దపెద్ద హోల్డింగ్‌లు ఏర్పాటు చేసి జనసేనలో తన హవా పెరుగుతోందంటూ ప్రచారం చేసుకునేవాడు. అయితే బాలాజీ నుంచి వేధింపులు మరింత ఎక్కువడడంతో బాధితురాలైన అమ్మాయి తన తండ్రికి అసలు విషయం చెప్పింది. దీంతో ఆయన ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా..   బాలాజీని, బాలును అరెస్ట్ చేశారు.

బాలాజీ ఇలాగే పవన్‌ వద్దకు తీసుకెళ్తానంటూ ఒక వివాహిత నుంచి కూడా భారీగా బంగారం, డబ్బు వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. వీరి చేతిలో మోసపోయిన అమ్మాయిలు, వివాహిత కూడా పవన్‌ అభిమానులే.   అలాంటి అమ్మాయిలను గుర్తించే ఈ ముఠా వల వేస్తున్నట్టు పోలీసులు మీడియాకు వివరించారు.