Home రాజకీయాలు అడగడానికని వెళ్తే కడిగేశారంట!

అడగడానికని వెళ్తే కడిగేశారంట!

1501
SHARE

టీవీ ఛానల్స్ డిబెట్స్ లోనూ, ఏకపక్ష మీడియా సమావేశాల్లోనూ ఊకదంపుడు ఉపన్యాశాలు.. ప్రాసలతో కూడిన ప్రసంగాలు చేసే ఏపీ అధికార పక్ష నేతలు ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీని కలుస్తామని, అనంతరం కడిగేస్తామని చెప్పి కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం బయటకు వచ్చిన యనమల అండ్ కో.. మాకు ఏమాత్రం సంతృప్తిగా లేదు, మరలా కలుస్తాం.. అని చెప్పి మీడియా ముందు బాదగా ముఖాలు పెట్టిన ఫోటోలు కల్లముందు కదలాడుతునే ఉన్నాయి. అయితే అవి ప్రత్యేక హోదా విషయంలో జైట్లీ స్పందనకు కాదు.. జైట్లీ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పెట్టిన ఫేస్ లంట!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనాల గొడవ పడలేకో, ప్రత్యేక హోదా విషయంలో జగన్ దూకుడుకు భయమేసో తెలియదు కానీ… ఇంతకాలం హోదా విషయాన్ని పక్కదారి పట్టించి, హోదా వద్దు ప్యాకేజే ముద్దు అనే రేంజ్ లో మాట్లాడిన టీడీపీ నేతలకు.. గుక్కతిప్పుకోనివ్వని ఎదురు ప్రశ్నల వర్షాలు కురిపించారట అరుణ్ జైట్లీ. మొన్న ఒకమాట, నిన్న ఒక మాట, నేడు ఒక మాట మాట్లాడితే ఎలా అని ప్రశ్నించిన జైట్లీ.. ప్యాకేజీ బాగుందని కృతజ్ఞతలు చెప్పింది మీరే కదా అని ప్రశ్నించారట! పోలవరం బాధ్యత కేంద్రం నుంచి మీరే తీసుకుని.. ఇపుడు కేంద్రం వల్లే పోలవరం ఆలస్యం అనడం ఏమిటి.. మీవల్ల కానప్పుడు ఎందుకు బాధ్యత తీసుకున్నారు.. ఈ రేంజ్ లో జైట్లీ ప్రశ్నించారని అంటున్నారు.

జైట్లీ ఆ రేంజ్ లో ఎదురు ప్రశ్నల వర్షాలు కురిపించేసరికి.. తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాం అన్న రేంజ్ లో టీడీపీ ఎంపీలు చక్కబడి వచ్చేశారట. ఇదేమిరా బాబు… జనాల బాద, ప్రతిపక్షాల ఒత్తిడి తట్టుకోలేక అడగడానికని వెళ్తే ఇలా కడిగి పాడేశారు అని జైట్లీని ఉద్దేశించి టీడీపీ నేతలు సన్నిహితుల దగ్గర వాపోయారట!!