Home రాజకీయాలు టీడీపీ – కాంగ్రెస్.. కొత్త సందేహాలు!

టీడీపీ – కాంగ్రెస్.. కొత్త సందేహాలు!

325
SHARE

రాజకీయాల్లో శాస్వత శతృవులు, శాస్వత మిత్రులు ఉండరనేది పాత సామెతే అయినా… మరీ ఇంత దారుణంగా కూడా ఉంటుందా అనే కొత్త అనుమానాలు వక్తపరుస్తున్నారు సీనియర్ విశ్లేషకులు. ఇంతకూ ఆ కొత్త అనుమానానం, రాజకీయ చదరంగంలో కొత్త స్నేహాల వివరాలు ఏమిటంటే… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ తో జతకడుతుందేమో అని! వినడానికి మరీ బారీ గాసిప్ లా ఉన్నప్పటికీ… జరుగుతున్న పరిణామాలు, చిన్న చిన్న సంఘటనలు ఈ అనుమానాలకు పునాదులు వేశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే నానుడి మరిచిపోలేము కదా!

ఇక వివరాల్లోకి వస్తే… ప్రత్యేక హోదా పోరాటం విషయంలో ఏపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేస్తున్న హడావిడిని సరిగ్గా గమనిస్తే.. ఈ పోరాటం హడావిడి మధ్యలో కాంగ్రెస్ – టీడీపీ దోస్తానా దిశగా అడుగులు వేస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఒక పార్టీ పోరాడేది ఎంత నిజాయితీ అయిన పోరాటం అయినప్పటికీ.. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు దానికి మద్దతు తెలపవు. కావాలంటే కాస్త పదాలు మార్చి వారు కూడా పోరాడతారే తప్ప తందాన తాన అనరు. ఈ విషయంలో కమ్యునిస్టులకు కాస్త ఫ్రీడం ఉన్నా.. మిగిలిన సోకాల్డ్ బడా రాజకీయ పార్టీలక్ ఆ అవకాశం లేదు.

అయితే తాజాగా భారీస్థాయిలో ఢిల్లీలో ఎవ్వరు ఊహించని రీతిలో ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వైకాపా నేతలకు అందిన మద్దతు సంగతి అలాఉంచితే… ఈ రోజు ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం అయిన టీడీపీ నేతలు చేస్తున్న పోరాటం ఒక వీది నాటకం అని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో.. ఆ పోరాటానికి మద్దతు ప్రకటించేస్తున్నారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు! వీరిలో కేవీపీ, రేణుకా చౌదరి లాంటి సీనియర్లు చొరవ తీసుకోవడం కొసమెరుపు!

దీంతో విశ్లేషకులు మెదళ్లకు మేత పెట్టారు! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. పైగా ప్రస్తుతం చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి రాబోయే ఎన్నికల్లో మిత్రపక్షం, మద్దతు పార్టీ లేదు అనే చెప్పాలి. ఈ క్రమంలో చివరాఖరుకు కాంగ్రెస్ తోక పట్టుకుని అయినా ఎన్నికలకు పోదాం అని చంద్రబాబు ఫిక్సయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో పవన్ సొంత కుంపటి, బీజేపీ దూరం, కమ్యునిస్టులు వైకాపా కు కాస్త సానుకూలంగా వ్యవహరించడం వంటి పరిణామాల నేపధ్యంలో ఆజన్మ శతృవులుగా ఉండే టీడీపీ – కాంగ్రెస్ పార్టీలు భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని, బాబుకు మరో ఆప్షన్ లేదని అంటూన్నారు విశ్లేషకులు!! ఏమోలెండి… రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చు.. ఇక బాబు మార్కు రాజకీయాల్లో అయితే మరీ అద్భుతాలే ఆవిష్కరింపబడతాయి!!