Home రాజకీయాలు మొహమాటామా, ముసుగులో గుద్దులాటా జనసేనానీ?

మొహమాటామా, ముసుగులో గుద్దులాటా జనసేనానీ?

SHARE

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి K చంద్రశేఖరరావు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ సందర్భంగా జాతీయ స్థాయిలో భాజపా కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని చెప్పి దేశంలో ఒక సంచలనానికి తెరతీశారు. NDA ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా పాలించటంతో ఘోరంగా విఫలమైందని మొహమాటం లేకుండా విమర్శించారు.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ సహా మిగతా నాయకులు కేసీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేసినప్పటికీ, ముఖ్యమంత్రికి అంతే మద్దతు పెరుగుతుండటం గొప్ప విషయం. మమతా బెనర్జీ వంటి నాయకురాలు KCR కి మద్దతు పలకటం ముదావహం.

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందించారు. పవన్ మూడో ప్రత్యామ్నాయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒక్క రక్తపు చుక్క కారకుండా తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తి KCR అని కితాబునిచ్చారు.

అయితే మూడో ప్రత్యామ్నాయాన్ని స్వాగతి౦చటం అంటే బాజపాని వ్యతిరేకిస్తున్నట్టే నా? ఆంధ్ర లో మరి జన సేన తెదేపా మరియూ భాజపా ల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుని ఉపసంహరించుకున్నట్టే నా? అదేదో ప్రత్యక్షంగానే చెప్పేయొచ్చు కదా ఈ ముసుగులో గుద్దులాటలెందుకు పవన్ గారు?