Home రాజకీయాలు రాష్ట్ర పక్షమా మిత్రునిపక్షమా పవన్?

రాష్ట్ర పక్షమా మిత్రునిపక్షమా పవన్?

SHARE

ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చలో ఢిల్లీ చేపట్టి నాయకులు కార్యకర్తలు భారీగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు అనగా మార్చి5 న డాల్జి లోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాచేయబోతున్నారు.

ఇక్కడ చూస్తే జన సేన అధినేత పవన్ కళ్యాణ్ రేపే వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటించాలి అని సవాలు చేశారు.

మార్చి21 న అవిశ్వాసం ప్రకటించటం వాళ్ళ ఒనగూరే ప్రయోజనం ఏమి ఉండదనేది ఆయన వాదన. అయితే జన సేన నాయకుడు మాత్రం ఒకటి చెప్పారు. వైసీపీ గనక అవిశ్వాసం ప్రకటిస్తే రాష్ట్రం కోసం కట్టుబడి తెదేపా ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతు ప్రకటిస్తారు. అవిశ్వాసం వల్ల వచ్చే లాభం సూన్యం అనే తెదేపా ని ఏమీ అనని పవన్ వైసీపీ కార్యాచరణ్ని అనుమానించాల్సి వస్తోంది అనడం హాస్యాస్పదం. తెదేపా సమగ్రతను శంకించరు కానీ మొదటి నించి ప్రత్యేక హోదా కావాలి అని పట్టుబడుతున్న వైసీపీ చర్యలు జన జనానికి అనుమానాయాసపదం. అమ్మ పెట్టా పెట్టాడు అడుక్కు తినా తిననివ్వదు అన్నట్టు వుంది పవన్ ధోరణి. ఇక ఆ JFFC కొండని తవ్వి ఎలుకని పట్టిన చందాన వుంది. నయా పైసా లాభం లేని ఒక కమిటీ దాని రిపోర్ట్ కన్నా ఉడుత భక్తిగా జన సేన కూడా వైసీపీ తో కలిసి ధర్నా లో పాల్గొంటే ఒనగూరే ప్రయోజనమే ఎక్కువ. మరి పవన్ ఎం చేస్తారనేది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. కనీసం వైసీపీ అవిశ్వాస తీర్మానానికి  తెదేపా ఎంపీలు ఇచ్చేలా అయినా పవన్ కల్యాణ్ చూడాలి. చూద్దాం ఎం జరుగుతుందో!!