Home సినిమా కపూర్ల ఖాన్దానికి వర్మ టెన్షన్

కపూర్ల ఖాన్దానికి వర్మ టెన్షన్

197
SHARE

కాంట్రవర్సీలకు మారుపేరైన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కాంట్రవర్సీనే తన సినిమాలకు స్టోరీలు గా వాడుకుంటాడని పేరు. అటు ముంబై పేలుళ్లు అయినా కానీ, సెక్స్ కథలైనా కానీ  ఎవరికీ భయపడకుండా తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెర కెక్కించటంలో వర్మ సిద్ధహస్తుడు.

అయితే తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి జీవిత కద ఆధారంగా సినిమాకి వర్మ ప్లాన్ చేయటమే కపూర్లకి టెన్షన్ అవుతోంది. శ్రీదేవి మృతి పై అనేక వార్తల నేపథ్యంలోదుబాయ్ ఫోరెన్సిక్ మరియు పోలీస్ వారి నిర్ధారించిందేమిటంటే ఆమె బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారు.

మన భారతీయ సినిమా చరిత్రలో ఓ సెలబ్రిటీ మరణం ఇలా వున్నా దాఖలాలే లేవు. ఆమె చావు గురించిన ఎన్నో అనుమానాల నేపథ్యంలో వర్మ బయోపిక్ ఆలోచన అప్పుడే మొదలు పెట్టడ౦ ఆశ్చర్యమే.

శ్రీదేవితో క్షణక్షణం, గోవిందా గోవిందా సినిమాలు చేసిన వర్మ, ఆమె అంటే పది చచ్చే వర్మ ఆమె మరణంతో మానసికంగా వ్యధ చెందాడు. శ్రీదేవి మరణ వార్త మొదలైందగ్గర నుంచి ఆమె అంత్యక్రియల వరకూ ట్వీట్ల పర్వ౦ గా ఆమె పై గల అభిమానాన్ని ఎంత గానో చాటుకున్నాడు వర్మ.

అయితే ఇప్పుడు ఆమె జీవిత కాదని ఆధారంగా చేసుకొని సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు మాత్రం కపూర్ల ఖాన్దానికి  మింగుడు పడని విషయంగా వుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు కపూర్లు అంతే ఉత్కంఠ తతో వేచి చూస్తున్నారు. కపూర్ల ఒత్తిళ్లకు వర్మ తలొగ్గుతాడా అంటే అనుమానమే!!