Home రాజకీయాలు 2019 ఎన్నికలలో బాబు వ్యూహం పనిచేస్తుందా ?

2019 ఎన్నికలలో బాబు వ్యూహం పనిచేస్తుందా ?

SHARE

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2014 లో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలన్నిటిని నెరవేరుస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. కానీ చంద్రబాబు ఆ హామీలను నెరవేర్చకుండా చేతులెత్తేశారు. దీనితో 2019 ఎన్నికలు కోసం చంద్రబాబు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో బాబు ఏమైనా హామీలను ఇచ్చినా కూడా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితులలో లేరు.

ఎందుకంటె 2014 లో జరిగిన ఎన్నికల్లో బాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. కాగా. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, ఆయన పాలన ప్రాతిపదికన చర్చ జరగాలి. ఇందులో రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయం కూడా ప్రధానమే. అయితే చంద్రబాబు తన పాలనా అంశాలపై చర్చ ప్రాతిపదికన 2019 ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం లేదు.

గతంలో నంద్యాలలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఏపీకి రాజధాని, పోలవరం ప్రాజెక్టు మరియు ఏపీలోని ప్రజలకు నిరుద్యోగబృతి, బుణమాఫీ లాంటి విషయాల గురించి అసలు ప్రస్తావించలేదు. రెండు నెలలకు ముందు బాబుగారు ఏవైతే అబివృద్ది ఫదకాలను చేపట్టారో వాటి గురించే చర్చకు పెట్టి ఫలితం సాధించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్నే 2019 ఎన్నికల్లో కూడా అమలు చేద్దామని అనుకుంటున్నారు.

కానీ బాబు బాగా అలోచించి ఈ వ్యూహం కేవలం ఒక్క నియోజకవర్గంలో అయితేనే సాధ్యం అవుతుంది..మొత్తం రాష్ట్రంలో సాధ్యం కాదు.. అని భావించారు. దీనితో రాష్ట్రంలో మరోసారి సెంటి మెంట్ రాజకీయం చేయాలనీ, అలా చేస్తేనే ఈసారి కూడా అధికారంలోకి రావొచ్చునని బాబు ప్లాన్ వేస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్షం కానీ చర్చకు రావాలని ప్రస్తావిస్తే… కేంద్రం రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తుంటే దానిమీద పోరాడాల్సింది పోయి ఇప్పుడు ఇలా రాజకీయం చేస్దారా అంటూ ప్రతిపక్షంపై బాబు ఎదురు దాడి చేయవచ్చు.

2019 ఎన్నికలలో చంద్రబాబు తన అజెండాల ప్రస్దావన లేకుండానే ఎలా అయితే 2014 ఎన్నికల్లో సెంటి మెంట్ రాజకీయాలతో గెలిచారో ఈసారి కూడా అలానే గెలవాలని వ్యూహాన్ని రచిస్తున్నారు. మరి 2019 ఎన్నికల్లో చంద్రబాబు పన్నిన ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో అనేది మాత్రం చూడాల్సిందే.