Home రాజకీయాలు బాబుకి రానున్న ఎన్నికల గురించి భయం పట్టుకుందా ?

బాబుకి రానున్న ఎన్నికల గురించి భయం పట్టుకుందా ?

239
SHARE

రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి మారుతుంటాయి. ఎప్పుడూ ఒకలానే ఉండవు. ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రజల ఆలోచన కూడా మారుతూ ఉంటుంది. ఏ నాయకుడ్ని ఎన్నుకుంటే తమకు మంచి జరుగుతుందనే భావనలో ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ నేపద్యంలో రాజకీయనేతలు కూడా వారిచ్చిన హామీలు అమలు చెయ్యకపోయినా పర్లేదు కానీ.. జనాల ఆలోచన ఇతర పార్టీనేతల వైపు మాత్రం అసలు వెళ్లకూడదని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఎన్నికల సమయానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేసిన అభివృద్ధి కనపడకపోతే ప్రజల అలోచానా విధానం మారిపోతుంది. ఎన్నికల సమయానికి అయిన రాజకీయ నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని అనుకున్నా కూడా ఒక్కోసారి నిధుల కరువు ఏర్పడి వారిని భయపెడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా ఇదే భయంతో ఉన్నారని రాజకీయ వర్గాల నుండి సమాచారం.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కంటే సీనియర్ రాజకీయ నాయకుడు మరియు ఆయనలా ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఇక ఎవరూ లేరు. ఇక ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి విషయానికొస్తే ఆయన తన తండ్రి రాజకీయంతో ముందుకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు రచించిన వ్యూహాలు చాలామటికి వైఎస్ హయాంలో బెడిసికొట్టాయి. దీనితో బాబుకి రెండు సార్లు సీఎం సీటు కూడా చేజారిపోయింది.

కాగా, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కేవలం కేంద్రం వలనే అని ప్రజలు అర్ధం చేసుకుంటే చంద్రబాబుకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో సమస్య ఏమి ఉండదు కానీ, ప్రజలు అలా అనుకోకుండా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వలనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బాబుకి ప్రభావం చూపకతప్పదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో తన పార్టీని బరిలోకి దింపుతున్నాడు. దీనితో పవన్ మద్దతు కూడా బాబుకి లేనట్లే. ఈ కారణాలన్నీ చంద్రబాబులో విపరీతమైన భయాన్ని పెంచుతున్నాయట. మరి దీనికి చంద్రబాబు నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీని గెలిపించడం కోసం ఎటువంటి స్కెచ్ వేస్తారో అనేది మాత్రం చూడాల్సిందే.