Home సినిమా రాజమౌళి సినిమాలో హీరోయిన్స్ వీరేనా ?

రాజమౌళి సినిమాలో హీరోయిన్స్ వీరేనా ?

235
SHARE

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. రాజమౌళి తరువాతి సినిమా కోసం ఆయన అభిమాలు మరియు సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరువాతి సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్‌ లో ఉంటుందని తెలిసింది.

ఈ సినిమాకి సంబంధించి రోజుకొక వార్త హల్ చల్ చేస్తుంది. కాగా, ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా మరోసారి నటించనుందని వార్త వచ్చింది. ఇక రామ్ చరణ్ కు జంటగా నటించేది ఎవరనేది కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనట. ” రంగస్థలం ” లో రామ్ చరణ్ మరియు సమంతల జంట చూడటానికి బాగుండడంతో ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కి జంటగా సమంతనే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ వార్తలో నిజమెంతుందో అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.