Home రాజకీయాలు మోడీని అవమానించి ఇప్పుడు రాజీకి వెళ్లారా?

మోడీని అవమానించి ఇప్పుడు రాజీకి వెళ్లారా?

SHARE

శ్రీకాకుళం ఎమ్.పి రామ్మోహన్ నాయుడు మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు వెళ్లడంతో ఏమైనా రాయబారంను చేరవేశారేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ పై బీజేపీ గత కొద్దీ రోజుల నుండి విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడొక మద్యవర్తి వద్ద వీరు సమావేశం అయ్యారని సమాచారం రావడంతో టీడీపీ నేతలు కేంద్రంతో రాజీ కోసమే ఇలా సమావేశం అయ్యారని చాలామంది అంటున్నారు.

త్వరలోనే పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి షాతో చర్చించామని వీరు చెబుతున్నారు. కాగా, మీడియా ముందు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ… మోడీని అవమానిస్తూ… ఇప్పుడు ఈ రాజీ కోసం వెళ్లడమేంటో ? టీడీపీ నేతలే బీజేపీ ని రాజీకి పిలిచారా లేక బీజేపీనే టీడీపీని రాజీకి పిలిచిందా అనేది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసిన అన్యాయం చిన్నాచితకాది కాదు. ఏపీ జనం ఇక బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఎవరైనా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే కలుగుతుంది తప్ప లాభమేమి ఉండదు. బీజేపీతో పొత్తు అని అనగానే బీజేపీ మీద ఉన్న కోపమును పొత్తు పెట్టుకున్న పార్టీపై కూడా చూయించే అవకాశాలు ఉండనే ఉన్నాయి.