Home సినిమా ఇలా అభాసు పాలయ్యావేంటి కస్తూరీ?

ఇలా అభాసు పాలయ్యావేంటి కస్తూరీ?

157
SHARE

శ్రీదేవి మరణంకి సంతాప౦ వ్యక్తం చేస్తూ సెలెబ్రిటీలు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టులు పెడుతూ విచారాన్ని విచారం వ్యక్తం చేస్తుంటే మాజీ నటియైన కస్తూరి ఒక వ్యంగ్య పోస్టుతో కామెడీ చేయబోయింది. కానీ అది పేలక తానే అభాసు పాలయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్విట్టర్ వేదికగా చేసుకుని కస్తూరి శ్రీదేవి మరణిస్తే మీడియా ఆమె సినిమాల్లో పాటలు, సన్నివేశాలు ప్రదర్శిస్తున్నాయి కదా మరి సన్నీలియోన్ చనిపోతే ఏం చూపిస్తాయి అని ఒక సటైర్ వేసింది. అంతే, ఆమెపై విమర్శల వాన మొదలు. బుద్ధి వుండే ఇలా ట్వీట్ చేశావా అని ఒకరంటే, ఇటువంటి సందర్భాల్లో  సెటైర్లు అవసరమా తల్లీ అని కొంతమంది దుమ్మెత్తి పోశారు.

తాను కేవలం పేస్ బుక్ లో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ మాత్రమే చేశానని సర్ది చెప్పుకున్నారు. ఏమైనా ఒక లేడీ సూపర్ స్టార్ మరణాన్ని ఇంకా దేశం జీర్ణించుకోకముందే కస్తూరి సరదాకు పని పెట్టటం ఎంత వరకు సమర్ధనీయం అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.