Home రాజకీయాలు టీ టీడీపీ కి ఊపిరి పొసే బాధ్యత ఎన్టీఆర్ కేనా?

టీ టీడీపీ కి ఊపిరి పొసే బాధ్యత ఎన్టీఆర్ కేనా?

122
SHARE

ఇక తదుపరి ఎన్నికలు దగ్గరబడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం లో బిజీ బిజీ అవుతున్నాయి.

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఊడ్చి పెట్టుకు పోవటంతో ఆ పార్టీ ని తిరిగి  కిందిస్థాయి నుంచి పెంచే విధంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సందర్భంగా తెలంగాణలో తే దే పా క్యాడర్ల తో నాయకులతో భేటీ అయ్యారు. ఇక ఆ మీటింగ్ లో అధ్యక్షుల వారికి పెద్ద షాకే తగిలింది జూనియర్ ఎన్టిఆర్ ని టీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించ మని క్యాడర్లు నాయకులు, ఒకటే గోల, అరుపులూ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాక బొత్తిగా కాళీ అయినా పార్టీ కొంత ఊపిరి పోయగల సత్తా ఎన్టీఆర్ కి కచ్చితంగా వుంది. కనీసం పార్టీ ఉనికి కాపాడగల సత్తా వున్నవాడు యంగ్ టైగర్.

చంద్రబాబు రాజకీయం తెలిసినవాడు ఎవరైనా ఛీ ఛీ ఎన్టీఆర్ ని ససేమిరం నాయుడు ఆహ్వానించడుగాక ఆహ్వానించడు అనే అంటారు. మరి వేరే దిక్కెవరు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులంటూ వుండరు గనక ఎన్టీఆర్ ని టీటీడీపీ అధ్యక్షుడిగా రప్పించే ప్రయత్నాలు బాబు మొదలెట్టేశారని వినికిడి.  ఒకవేళ ఇదే నిజమైతే పార్టీ భవిష్యత్తు పునరుద్ధరించబడుతుంది అని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు!!