Home రాజకీయాలు చంద్రబాబుపై కక్ష్య తీర్చుకోవడానికి మోడీ వేసిన ప్లాన్ ఇదేనా !

చంద్రబాబుపై కక్ష్య తీర్చుకోవడానికి మోడీ వేసిన ప్లాన్ ఇదేనా !

214
SHARE

ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేసిన అన్యాయంపై టీడీపీ నేతలు మిత్రపక్షం అని కూడా మరచిపోయి మోడీపై మరియు బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. దీనితో ప్రధాని మోడీ చంద్రబాబుపై కక్షను తీర్చుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సవంత్సరంలో అడుగుపెట్టాం. ఇంకా మోడీని నమ్ముకుంటూ ఉంటే లాభం లేదని చంద్రబాబు తిరుగుబాటు చేశారు.

దీనితో మోడీ ప్రస్తుతం ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నారో అని ఏపీ బీజేపీ నేతలు వివరిస్తున్నారు. మోడీ దగ్గర వంగి వంగి ఉంటేనే పనులు సాగవు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తిరుగుబాటు చేసిందని ఇక ఏపీకి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని చెబుతున్నారు. విశాఖ ఎంపీ హరిబాబు చెప్పిన లెక్కల్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టడంతో ప్రధానమంత్రి కార్యాలయం చాలా ఆగ్రహంగా ఉన్నట్లు ఏపీ బీజేపీ నేతలు వివరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పత్రికలలో వస్తున్న టీడీపీ నేతల విమర్శల్ని అనువాదం చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతున్నారు. దీనివలనే ఏపీ లో ఇంత ఆందోళన జరుగుతున్నా ప్రధాని మోడీ కానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కానీ స్పందించడం లేదని చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ మోడీ చంద్రబాబుపై ఉన్న కోపంతో తీవ్రంగా నష్టపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ పట్ల కక్ష్య పూరితంగా ప్రవర్తించడం దుర్మార్గం.