Home రాజకీయాలు చంద్రబాబు అసలు క్యారెక్టర్‌ ఇదీ- కరుణాకర్‌ రెడ్డి

చంద్రబాబు అసలు క్యారెక్టర్‌ ఇదీ- కరుణాకర్‌ రెడ్డి

188
SHARE

40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులాగా బతికానని.. వ్యక్తిత్వాన్ని ఏనాడు కోల్పోలేదని.. నీతి నిజాయితీలే పునాదులుగా జీవితం సాగించానని చంద్రబాబు చెప్పడంపై వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చరిత్ర ఎలా ఉంటుందో ఉదాహరణలతో వివరించారు.

1977 లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో చిత్తూరు నుంచి రాజగోపాలనాయుడు బరిలో దిగగా.. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించారన్నారు. ప్రచారం కోసం తిరిగేందుకు ఒక జీపు, 200 లీటర్ల పెట్రోల్ డ్రమ్ము ఇచ్చి పంపిస్తే.. దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్‌ నేత వీరరాఘవులనాయుడుకు చెందిన పెట్రోల్‌ బంకులో చంద్రబాబు అమ్మేశారని కరుణాకర్ రెడ్డి చెప్పారు.

ఈ విషయాన్ని స్వయంగా వీరరాఘవులనాయుడే చెప్పారన్నారు. 1974లో ఎస్వీ యూనివర్శిటీలో ఆర్‌ఎస్‌ యూనియన్ నడిపేందుకు నిధుల సేకరణలో భాగంగా ఒకసినిమా బెనిఫిట్‌ షో టికెట్లను ఒక్కొక్కటి రూ.2కు తాము విక్రయించామన్నారు. ఆ సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లి టికెట్ కొనాల్సిందిగా కోరగా.. గదిలో నిద్రిస్తున్న స్నేహితుడి జేబులో నుంచి రూ. 2 దొంగిలించి తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు.

అలాంటి నీచ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇప్పుడు తాను నీతినిజాయితీల మీద రాజకీయం చేశానని చెప్పడం సిగ్గుగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొంటూ, తెలంగాణ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయిన చంద్రబాబు నీతులు చెబుతూ పత్రికల్లో రాయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్రమొత్తం తనకు తెలుసని.. చంద్రబాబు 40ఏళ్ల రాజకీయం నీచమేనని కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.