Home రాజకీయాలు చంద్రబాబుని రామ్ మాధవ్ బుజ్జగించారా ?

చంద్రబాబుని రామ్ మాధవ్ బుజ్జగించారా ?

215
SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ బుజ్జగించారా ? అని అంటే అవుననే అంటుంది ఓ ఆంగ్ల పత్రిక. ఈ పత్రిక చంద్రబాబుతో రామ్ మాధవ్ మంతనాలు జరిపినట్లు కథనంను ఇచ్చింది. ఇందుకోసమే రామ్ మాధవ్ ఆంద్రప్రదేశ్ కి వచ్చారట. టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న గొడవల గురించి ఆయన చర్చించి.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిపై రామ్ మాధవ్ కూడా మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ ల మధ్య రాజకీయ పరమైన అంశాలతో ఎటువంటి గొడవలు లేవని, కేవలం ఆర్ధిక పరమైన విషయాలలో మాత్రం తేడా వచ్చిందని.. ఇప్పుడు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాధానమిచ్చారు. టీడీపీ ఎంపీ లు మార్చిఐదవ తేదీ నుండి మరోసారి ప్రారంభం అవుతున్న పార్లమెంటు సమావేశాలలో ఆందోళనకు దిగకుండా ఉండటానికి వారిని బుజ్జగిస్తూ రామ్ మాదవ్ ఇలా మంతనాలు జరుపుతున్నారని చాలామంది అంటున్నారు.

మరి రామ్ మాదవ్ ఏపీకి వచ్చిన పని ముగించారా ? చంద్రబాబుని బుజ్జగించారా ? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.